Minister: మంత్రి సంచలన కామెంట్స్.. రాజకీయాల్లో ఆ హీరో ఓ బచ్చా..
ABN , Publish Date - May 27 , 2025 | 06:55 AM
రాజకీయాల్లో ఆ హీరో ఓ బచ్చా.. ఎవరెన్ని చెప్పినా.. మళ్లీ అధికారం డీఎంకే పార్టీదేనని రాష్ట్రమంత్రి దురైమురుగన్ వ్యాఖ్యానించారు. ఆ కామెంట్స్ ఇప్పుడు తమిళనాట సంచలనానికి దారితీశాయి. మరికొద్ది రోజుల్లో తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది.

- మంత్రి దురైమురుగన్
చెన్నై: ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌పై రాష్ట్ర మంత్రి దురైమురుగన్(Minister Duraimurugan) కటువైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో విజయ్ ఒక ‘బచ్చా’ అని మండిపడ్డారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడంపై విజయ్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈడీ తనిఖీలకు భయపడే సీఎం ఆ సమావేశానికి వెళ్లారని, తమ కేసుల గురించి ప్రధాని వద్ద ప్రస్తావించలేదని చెప్పగలరా అంటూ విజయ్ సీఎంను ప్రశ్నించారు.
ఢిల్లీ సమావేశం సందర్భంగా వెలువడిన ఫొటోలు డీఎంకే-మధ్య అవగాహన కుదిరినట్లు చెబుతున్నాయని ఎద్దేవా చేశారు. సోమవారం రాణీపేటకు వచ్చిన మంత్రి దురైమురుగన్‌ను మీడియా విజయ్ విమర్శలను ప్రస్తావించగా.. ‘బచ్చా ఇన్ పాలిటిక్స్’ అంటూ కటువుగా వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Fashion Designer: ప్రతి నూలు పోగుకూ ఓ కథ..!
Gold Rates Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి
Read Latest Telangana News and National News