Share News

Supreme Court Terrorism Case: బాంబు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

ABN , Publish Date - Jul 25 , 2025 | 03:13 AM

బాంబు పేలుళ్ల కేసులోని 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గురువారం సుప్రీంకోర్టు..

Supreme Court Terrorism Case: బాంబు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

  • విడుదలైన ఖైదీలు మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పనిలేదు

  • ధర్మాసనం స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జూలై 24: బాంబు పేలుళ్ల కేసులోని 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గురువారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇప్పటికే జైలు నుంచి విడుదలైన నిందితులపై ఈ తీర్పు ప్రభావం చూపబోదని తెలిపింది. 2006లో ముంబైలోని లోకల్‌ రైళ్లలో జరిగిన ఏడు పేలుళ్ల సంఘటనల్లో 180 మందికిపైగా మరణించిన కేసుల్లో కింది కోర్టు వారికి శిక్షలు విధించింది. హైకోర్టు మాత్రం.. తగిన ఆధారాలు చూపడంలో ప్రాసిక్యూషన్‌ దారుణంగా విఫలమయినందున నిందితులు నేరం చేశారని నమ్మడం చాలా కష్టమని పేర్కొంటూ ఈ నెల 11న తీర్పు చెప్పింది. దీన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం మరుసటి రోజునే సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. విచారణ జరిపిన జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌ల ధర్మాసనం ఆ తీర్పుపై స్టే ఇచ్చింది. అయితే విడుదలైన ఖైదీలు మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. ఈ తీర్పును ఇతర కేసుల్లో వాదనలకు ఒక ఉదాహరణగా చూపించకూడదని పేర్కొంది. ఈ తీర్పు పెండింగ్‌లో ఉన్న ఇతర కేసులపై ప్రభావం చూపుతుందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పడంతో వాదనల్లో దీనిని ఉదాహరణగా ప్రస్తావించకూడదని ధర్మాసనం తెలిపింది. అందువల్ల ఆ అంశం వరకు మాత్రమే స్టే ఇస్తున్నట్టు పేర్కొంది.

ఈ వార్తలు కూడా చదవండి..

చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్‌స్టాప్‏లు

ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..

For More National News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 03:13 AM