Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదికివ్వండి
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:30 AM
ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రస్తుత యథాతథ స్థితిని తమకు నివేదించాలని పశ్చిమబెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది.

న్యూఢిల్లీ, జూలై 14: ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రస్తుత యథాతథ స్థితిని తమకు నివేదించాలని పశ్చిమబెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం పట్ల జస్టి్‌సలు జె.బి.పార్దీవాలా, ఆర్.మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులో అమికస్ క్యూరీగా ఉన్న న్యాయవాది.. అపర్ణ భట్ సంబంధిత శాఖ సహకారాన్ని కోరారు. 2023 మే 4న ఐఐటీ - ఖరగ్‌పూర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే, మే 8న కేసు నమోదుకు దారి తీసిన పరిస్థితులతోపాటు దర్యాప్తుపై తాజా పరిస్థితిని తెలియజేయాలని పశ్చిమ బెంగాల్ పోలీసులను కోరింది.