Supreme Court: సావర్కర్‌పై వ్యాఖ్యలకు రాహుల్‌ను మందలించిన సుప్రీంకోర్టు
ABN , Publish Date - Apr 25 , 2025 | 02:58 PM
లక్నో కోర్టు ఆదేశాలను ఏప్రిల్ 4న సుప్రీంకోర్టులో రాహుల్ సవాల్ చేశారు. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో భారత్ జోడో యాత్ర సందర్భగా 2022 నవంబర్ 17న సావర్కర్‌ను రాహుల్ విమర్శించారు. దీనిపై పరువునష్టం కేసు దాఖలైంది.

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ (Vinayak Damodar Savarkar)పై వివాదాస్పద వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని సుప్రీంకోర్టు (Supreme court) శుక్రవారంనాడు మందలించింది. అయితే, దీనిపై లక్నో కోర్టు జారీ చేసిన సమన్లపై స్టే మంజూరు చేసింది.
Rahul Gandhi: కశ్మీర్‌కు చేరుకున్న రాహుల్.. బాధితుల పరామర్శ
చరిత్ర, జియోగ్రఫీ తెలుసుకోకుండా స్వాతంత్ర్య సమరయోధులపై ప్రకటనలు చేయడం సరికాదని జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాహుల్ గాంధీని తప్పుపట్టింది. రాహుల్ చేసిన ప్రకటన శత్రుత్వాన్ని ప్రోత్సహించేలా ఉందంటూ న్యాయవాది ఒకరు చేసిన ఫిర్యాదుపై హైకోర్టు లక్నో బెంచ్ ఆయనకు సమన్లు జారీ చేసింది. తనపై జారీ చేసిన సమన్లను కొట్టివేయాలంటూ రాహుల్ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో లక్నో కోర్టు ఆదేశాలను ఏప్రిల్ 4న సుప్రీంకోర్టులో రాహుల్ సవాల్ చేశారు. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో భారత్ జోడో యాత్ర సందర్భగా 2022 నవంబర్ 17న సావర్కర్‌ను రాహుల్ విమర్శించారు. దీనిపై పరువునష్టం కేసు దాఖలైంది.
కాగా, పహల్గాం ఉగ్రదాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ శుక్రవారంనాడు శ్రీనగర్ చేరుకున్నారు. ఏప్రిల్ 22న ఉగ్రదాడిలో గాయపడిన 26 మందిని బదామిబాగ్ కంటోన్మెంట్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. వీరిని రాహుల్ పరామర్శిస్తారని పార్టీ నేతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులతో పాటు వాణిజ్య, పర్యాకక రంగం ప్రతినిధులను రాహుల్ కలుసుకుంటారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో వేర్వేరుగా సమావేశమవుతారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలోనూ పాల్గొంటారు.
ఇవి కూడా చదవండి..
Pahalgam Attack: ఆర్మీ, పారామిలటరీ యూనిఫాం అమ్మకాలపై పోలీసులు ఆంక్షలు
Exercise Aakraman: ఎల్ఓసీ సమీపంలో భారత వాయుసేన 'ఎక్సర్‌సైజ్ ఆక్రమణ్'
Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. ఎమ్మెల్యే అరెస్ట్
For National News And Telugu News