Share News

Operation Kagar: ఆపరేషన్ కగార్‌కు సన్ స్ట్రోక్..

ABN , Publish Date - Apr 25 , 2025 | 02:55 PM

Operation Karre Gutta: కేంద్ర భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్‌కు సన్ స్ట్రోక్ అడ్డంకిగా మారింది. బీజాపూర్ - తెలంగాణ సరిహద్దుల్లో కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలకు వడ దెబ్బ తగిలింది.

Operation Kagar: ఆపరేషన్ కగార్‌కు సన్ స్ట్రోక్..
Operation Kagar

Operation Karre Gutta: కేంద్ర భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్‌కు సన్ స్ట్రోక్ అడ్డంకిగా మారింది. బీజాపూర్ - తెలంగాణ సరిహద్దుల్లో కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలకు వడ దెబ్బ తగిలింది. ఈ పరిస్థితి ఆపరేషన్ కగార్‌కు అడ్డంకిగా మారింది. వడ దెబ్బ తగిలి 40 మంది జవాన్లు డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. ఆర్మీ హెలికాప్టర్‌లో భద్రాచలం హాస్పిటల్‌కు తరలించారు. సన్ స్ట్రోక్‌కు గురైన భద్రతా బలగాలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


కర్రె గుట్టల్లో భారీ స్థాయిలో మావోయిస్టులు ఉన్నారని.. మావోయిస్టు కీలక నేత హిడ్మా కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం అందడంతో.. భారీగా భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. దాదాపు 8 వేల మందికి పైగా సిబ్బంది మావోయిస్టుల వేట సాగిస్తున్నాయి. కర్రె గుట్టలను చుట్టుముట్టి.. మావోయిస్టులపై దాడికి పాల్పడుతున్నారు. కర్రెగుట్టల చుట్టూ.. ఉత్తరాన ఛత్తీ్‌సగఢ్‌లోని పూజారి కాంకేర్‌, తూర్పున భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్ల, దక్షిణాన ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, తూర్పున ఇంద్రావతి నది ప్రాంతాల్లో కూంబింగ్‌ కొనసాగుతోంది. మూడు రోజులుగా ఆపరేషన్ కర్రె గుట్టలు కొనసాగుతోంది. అయితే, ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో.. బద్రతా సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా మంది సన్‌స్ట్రోక్‌తో సతమతం అవుతున్నారు. కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలు.. అధిక ఉష్ణోగ్రతల కారణంగా అస్వస్థతకు గురవుతున్నారు.


ఇదిలాఉంటే.. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ గుట్టలను జల్లెడపట్టేందుకు భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. మావోయిస్టులను గుర్తించేందుకు హెలికాప్టర్లు, డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. తాజాగా డ్రోన్లతో చేపట్టిన దాడుల్లో ముగ్గురు మహిళా నక్సల్స్ మృతి చెందారు. ఇదే విషయాన్ని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లించారు. అయితే, చనిపోయిన మావోయిస్టులు హిడ్మా దళానికి చెందిన వారుగా అనుమానం వ్యక్తం చేశారు ఐజీ.


Also Read:

హైకోర్టులో తేల్చుకో.. బోరుగడ్డకు సుప్రీం షాక్

ఈ ఉంగరంతో మీ దశ తిరిగినట్టే..

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. ఎందుకంటే..

For More National News and Telugu New..

Updated Date - Apr 25 , 2025 | 02:55 PM