Pahalgam Terror Attack: త్వరలో గట్టి జవాబిస్తాం.. ఉగ్రవాదులకు రాజ్‌నాథ్ వార్నింగ్
ABN , Publish Date - Apr 23 , 2025 | 07:02 PM
ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేది భారత్ విధానమని, ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని రాజ్‌నాథ్ అన్నారు. దాడికి పాల్పడిన వారిని, కుట్ర పన్నిన వారిని బయటకు లాగి తగిన గుణపాఠం చెబుతామని చెప్పారు.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు, వారి వెనుక ఉన్న శక్తులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న వారిని ఉపేక్షించేది లేదని, త్వరలోనే భారత్ గట్టి జవాబిస్తుందని హెచ్చరించారు.
Pahalgam Terror Attack: ఉగ్ర 'వేట' మైదలైంది... జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు
''ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడే వారికి త్వరలో గట్టి సమాధానమిస్తాం. ఉగ్రవాదుల వెనుక ఉండి కుట్రలు నిడిపిస్తున్న వారిని సైతం టార్గెట్ చేస్తాం'' అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పహల్గాం ఘటన, శ్రీనగర్‌లో భద్రతా చర్యలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠితో సుమారు రెండున్నర గంటల సేపు రాజ్‌నాథ్ బుధవారంనాడు సమావేశమయ్యారు.
ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేది భారత్ విధానమని, ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని రాజ్‌నాథ్ అన్నారు. దాడికి పాల్పడిన వారిని, కుట్ర పన్నిన వారిని బయటకు లాగి తగిన గుణపాఠం చెబుతామని చెప్పారు. భారత్ అతి పురాతన దేశమని, ఉగ్రవాదానికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..