Share News

F-35B Jet: 22 రోజుల తర్వాత హ్యాంగర్‌కు తరలించిన ఎఫ్-35 ఫైటర్ జెట్

ABN , Publish Date - Jul 06 , 2025 | 04:46 PM

ఇండో-యూకే నావికా విన్యాసాల్లో గత నెలలో పాల్గొన్న ఎఫ్-35బీ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో జూన్ 14న తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని దించారు. భారత వాయిసేన విమానం సురక్షితంగా దిగేందుకు, ఇంధనం నింపేందుకు, లాజిస్టిక్ అసిస్టెన్స్‌‌ అందించింది.

F-35B Jet: 22 రోజుల తర్వాత హ్యాంగర్‌కు తరలించిన ఎఫ్-35 ఫైటర్ జెట్
F-35B Jet

తిరువనంతపురం: సాంకేతిక కారణాలతో కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో 22 రోజలుగా నిలిచిపోయిన బిట్రిన్ రాయల్ నేవీకి చెందిన యుద్ధ విమానం ఎఫ్-35బి (F-35B)ను ఎట్టకేలకు విమానాశ్రయం ప్రాగణం నుంచి ఆదివారంనాడు తరలించారు. విమానాన్ని మరమత్తు చేసేందుకు, ఎయిర్‌లిఫ్ట్ చేసేందుకు సన్నాహకాలు ప్రారంభించారు. ఎఫ్-35 జెట్‌ మరమ్మతు కోసం బ్రిటిష్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌బస్ ఎ400ఎం అట్లాస్‌లో నిపుణుల బృందం తిరువనంతపరం విమానాశ్రయానికి ఉదయం చేరుకుంది. దీంతో జెట్‌ను నిలిచిపోయిన ప్రదేశం నుంచి హ్యాంగర్‌కు తరలించారు.


ఇండో-యూకే నావికా విన్యాసాల్లో గత నెలలో పాల్గొన్న ఎఫ్-35బీ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో జూన్ 14న తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. భారత వాయిసేన విమానం సురక్షితంగా దిగేందుకు, ఇంధనం నింపేందుకు, లాజిస్టిక్ అసిస్టెన్స్‌‌ అందించింది. అయితే విమానం ప్రీ-డిపార్చర్ తనిఖీల్లో హైడ్రాలిక్ వైఫల్యాన్ని కనుగొన్నారు. ముగ్గురు టెక్నీషియన్లతో కూడిన రాయల్ నేవీకి చెందిన చిన్న టీమ్ మరమ్మతు చేపట్టినప్పటికీ సమస్య తీవ్రత కారణంగా మరమ్మతు పనులు అసంపూర్తిగానే ఉండిపోయాయి.


నిలిచిపోయిన ఫైటర్ జెట్‌కు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) భద్రత కల్పించింది. తొలుత జెట్‌ను హ్యాంగర్‌కు తరలించేందుకు ఎయిర్ ఇండియా సుముఖత వ్యక్తం చేసినప్పటికీ బ్రిటిష్ రాయల్ నేవీ అందుకు నిరాకరించింది. అయితే ఆ తర్వాత జెట్‌ను హ్యాంగర్‌కు తరలించేదుకు సుముఖత తెలిపింది.


ఇవి కూడా చదవండి..

బీహార్‌ను నేరాల రాజధానిగా మార్చేశారు

ఆ బంగ్లా తక్షణం ఖాళీ చేయండి.. మాజీ సీజేఐకి సుప్రీంకోర్టు నోటీసులు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 06 , 2025 | 04:49 PM