Home » United Kingdom
ఆన్‌లైన్ గేమ్స్.. వీడియో గేమ్స్ ఆడే పిల్లలను తల్లిదండ్రులు ఇకపై ఓ కంట కనిపెట్టాల్సిందే. లేకపోతే అంతే సంగతులు. ఎందుకంటే.. డిజిటల్ గేమింగ్ ప్లాట్ ఫామ్స్‌ను రిక్రూట్‌మెంట్ అడ్డాగా మార్చుకుంటున్నాయి తీవ్రవాద బృందాలు. టీనేజర్లే లక్ష్యంగా.. చాట్ పేరిట మాటల గాలం వేసి తమవైపు లాక్కుంటున్నాయని తాజాగా బ్రిటిష్ పరిశోధకులు సంచలన నివేదిక విడుదల చేశారు.
రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలను బ్రిటన్‌లో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి తిప్పికొట్టారు. ఏ దేశం కోసం మా ఆర్థిక వ్యవస్థను స్విచ్చాఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఘాటుగా సమాధానమిచ్చారు.
ఇండో-యూకే నావికా విన్యాసాల్లో గత నెలలో పాల్గొన్న ఎఫ్-35బీ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో జూన్ 14న తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని దించారు. భారత వాయిసేన విమానం సురక్షితంగా దిగేందుకు, ఇంధనం నింపేందుకు, లాజిస్టిక్ అసిస్టెన్స్ అందించింది.
బ్రిటన్ వలసలపై కఠిన వైఖరి అవలంబిస్తోంది. పౌరసత్వం పొందేందుకు ప్రస్తుతం ఉన్న అయిదేళ్ల నిరీక్షణ సమయాన్ని పదేళ్లకు పెంచాలని నిర్ణయించింది.
భారత్, యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరింది. దీని ద్వారా రెండు దేశాల మధ్య దిగుమతి సుంకాలు తగ్గడం, వాణిజ్యం పెరగడం, సృష్టి, పెట్టుబడులు, ఉద్యోగాలు కల్పించడానికి దోహదం అవుతుంది
మమతతో జరిగిన చర్చలో మోడరేటర్ మాట్లాడుతూ, ఇండియా ఇప్పటికే యూకేను అధిగమించి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందనీ, 2060 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తొలి స్థానానికి చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయని అన్నారు. ఇందుకు మమత స్పందిస్తూ ''దీనితో నేను విభేదిస్తు్న్నాను'' అని అన్నారు.
Illegal Migration on UK : అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్నారు. కఠిన చర్యలను అమలు చేస్తూ వలసదారులను బెంబేలెత్తిస్తున్నారు. ఇప్పుడు మా వంతు అంటూ తాజాగా బ్రిటన్ ప్రభుత్వం కూడా అక్రమ వలసదారుల ఏరివేత మొదలుపెట్టింది. భారతీయ రెస్టారెంట్‌లే మెయిన్ టార్గెట్‌గా పలు చోట్ల దాడులు చేసి వందల మందిని అరెస్టు చేసి హడలెత్తిస్తోంది.
'గల్ఫ్ ఆఫ్ మెక్సికో ' పేరును 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మార్చాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై.. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఘాటుగా స్పందించారు..
దీపావళి సందర్భంగా యూకే ప్రభుత్వం అక్టోబరు 29న నిర్వహించిన వేడుకలో అతిథులకు మద్యం, మాంసాహారం అందించడంపై విమర్శలు వెల్లువెత్తడంపై ఆ దేశ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ స్పందించారు.
ఐరాస భద్రతామండలిని విస్తరించాలని, భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ అన్నారు.