Share News

Sriramulu: శ్రీరాములు సంచలన ఆరోపణ.. నన్ను రాజకీయంగా అణగదొక్కేందుకే ‘గాలి’ కుట్ర

ABN , Publish Date - Jan 23 , 2025 | 01:13 PM

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. సాధారణంగా శత్రువులు పరిస్థితులకు అనుకూలంగా మిత్రులవుతారు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆప్తుడని ముద్ర వేసుకున్న గాలి జనార్ధనరెడ్డిపైనే మాజీ మంత్రి శ్రీరాములు తీవ్రమైన ఆరోపణలు చేశారు.

Sriramulu: శ్రీరాములు సంచలన ఆరోపణ.. నన్ను రాజకీయంగా అణగదొక్కేందుకే ‘గాలి’ కుట్ర

- శ్రీరాములు సంచలన ఆరోపణ

బళ్లారి(బెంగళూరు): రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. సాధారణంగా శత్రువులు పరిస్థితులకు అనుకూలంగా మిత్రులవుతారు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆప్తుడని ముద్ర వేసుకున్న గాలి జనార్ధనరెడ్డి(Gali Janardhana Reddy)పైనే మాజీ మంత్రి శ్రీరాములు(Former Minister Sriramulu) తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్ర పన్నారని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బీజేపీ(BJP)లో గందరగోళంతోపాటు అధ్యక్షుడి మార్పు వంటి అంశాలపై మంగళవారం కోర్‌ కమిటీ సమావేశం జరిగింది.

వార్తను కూడా చదవండి: AC suburban train: ‘ఏసీ’ సబర్బన్‌ రైలు ట్రయల్‌ రన్‌..


రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రాధామోహన్‌దాస్ అగర్వాల్‌ మాజీ మంత్రి శ్రీరాములుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సండూరు శాసనసభ ఉప ఎన్నికల్లో మీ పనితీరు సరిగా లేదని అగర్వాల్‌ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా శ్రీరాములు ఖంగు తిన్నాడు. ఓటమిపై సదానందగౌడ సబ్‌ కమిటీ నివేదిక ఇవ్వకముందే ఎలా మాట్లాడతారని సభలోనే ప్రశ్నించారు. అనంతరం శ్రీరాములు మీడియాతో మాట్లాడుతూ అభ్యర్థి తరపున పనిచేశానని, నియోజకవర్గానికి వెళ్తే నా పనితీరును కార్యకర్తలు వివరిస్తారన్నారు. రాధామోహన్‌దాస్ అగర్వాల్‌ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు.


pandu1.2.jpg

పార్టీకి అంకితభావంతో పనిచేసిన కార్యకర్త అని, నా పట్ల చులకనగా మాట్లాడడం బాధ కలిగించిందన్నారు. నా గురించి గాలి జనార్ధనరెడ్డి వ్యతిరేకంగా మాట్లాడినట్టు తెలిసిందన్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడికి వివరించానన్నారు. రాజకీయంగా తనను అణగదొక్కాలనే కుట్రగా ఉందన్నారు. కాగా మరో రెండు నెలల్లో రాజకీయంగా మరిన్ని మార్పులు చోటు చేసుకుంటాయని బసనగౌడపాటిల్‌ యత్నాళ్‌ ప్రతిపక్షనేత అవుతారని బీజేపీ ఎమ్మెల్యే బీపి హరీశ్‌ వ్యాఖ్యానించారు. పార్టీలో గందరగోళ పరిస్థితికి ఇలాంటి వ్యాఖ్యలే కారణమయ్యాయి.


ప్రతి జిల్లా అధ్యక్ష పదవికి ముగ్గురి పేర్లు

పార్టీ జిల్లా అధ్యక్ష స్థానానికి ముగ్గురి పేర్ల సిఫారసుకు కమిటీ నిర్ణయించింది. బీజేపీ కోర్‌ కమిటీ తాజా రాజకీయాలపై చర్చించాక ఒక నిర్ణయం తీసుకున్నారు. 31 జిల్లాలకు పార్టీ అధ్యక్ష స్థానంకోసం పలువురు పోటీ పడుతున్న తరుణంలో క్రియాశీలకంగా వ్యవహరించే ముగ్గురిపేర్లును సిఫారసు చేయాలని కోర్‌ కమిటీ నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, మాజీ సీఎంలు సదానందగౌడ, బసవరాజ్‌ బొమ్మై, మాజీ మంత్రి శ్రీరాములు ఇదే అభిప్రాయాన్ని అంగీకరించారు. రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో అంతర్గత కలహాలకు స్వస్తి పలికేందుకు అధిష్ఠానం త్వరలోనే రంగంలోకి దిగే అవకాశం ఉంది.


ఈవార్తను కూడా చదవండి: Prakash Rao: రాజకీయాలు వద్దు.. వివరాలు చెప్పండి

ఈవార్తను కూడా చదవండి: మేం తలచుకుంటే కాంగ్రెసోళ్లు బయట తిరగలేరు

ఈవార్తను కూడా చదవండి: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే

ఈవార్తను కూడా చదవండి: పోలీసుల పహారాలో గ్రామసభలా?

Read Latest Telangana News and National News

Updated Date - Jan 23 , 2025 | 01:13 PM