Share News

Dharmasthala Skeleton: ధర్మస్థలలో ఆరో చోట కనిపించిన అస్థిపంజరం

ABN , Publish Date - Aug 01 , 2025 | 02:54 AM

కర్ణాటకలోని ధర్మస్థలలో మృతదేహాల ఆనవాళ్ల కోసం సిట్‌ జరుపుతున్న తవ్వకాల్లో మూడో రోజు ఓ అస్థిపంజరం

Dharmasthala Skeleton: ధర్మస్థలలో ఆరో చోట కనిపించిన అస్థిపంజరం

బెంగళూరు, జూలై 31(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని ధర్మస్థలలో మృతదేహాల ఆనవాళ్ల కోసం సిట్‌ జరుపుతున్న తవ్వకాల్లో మూడో రోజు ఓ అస్థిపంజరం బయటపడింది. ధర్మస్థలలో వందలాది మృతదేహాలను పూడ్చినట్లు నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. తొలి రెండు రోజులు ఐదు ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో మృతదేహాల ఆనవాళ్లేమీ లభించలేదు. మూడో రోజు గురువారం నేత్రావతి నది సమీపంలోని అటవీ ప్రాంతంలో సిట్‌ అధికారులు, దక్షిణ కన్నడ జిల్లా పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారుల సమక్షంలో తవ్వకాలు కొనసాగాయి. మాజీ పౌర కార్మికుడు చూపించిన ఆరో ప్రాంతంలో అస్థిపంజరం లభించింది. కొన్ని ఎముకలు, పగిలినట్లు ఉన్న పుర్రె బయటపడ్డాయి. ఫోరెన్సిక్‌ నిపుణుల బృందాలు అక్కడే ఉంటూ పర్యవేక్షిస్తున్నాయి. అస్థిపంజరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయించారు. అది పురుషుడిదని ప్రాథమికంగా గుర్తించారు. ఎస్పీ జితేంద్రకుమార్‌ దయా, పుత్తూరు ఏసీపీ స్టెల్లావర్గీస్‌ తవ్వకాలను పర్యవేక్షించారు. అస్థిపంజరం లభించిందనే సమాచారం తెలియగానే సిట్‌ కార్యాలయం నుంచి చీఫ్‌ ప్రణవ్‌ మొహంతీ, డీఐజీ ఎంఎన్‌ అనుచేత్‌ ఆ ప్రాంతానికి వచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్

జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2025 | 02:54 AM