Share News

Shubanshu Shukla: భూమికి తిరిగొచ్చాక వారం పాటు.. వైద్యుల పర్యవేక్షణలోనే శుభాంశు

ABN , Publish Date - Jul 13 , 2025 | 03:36 AM

యాక్సియం 4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రా ఐఎస్‌ఎస్‌నికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా..

Shubanshu Shukla: భూమికి తిరిగొచ్చాక వారం పాటు.. వైద్యుల పర్యవేక్షణలోనే శుభాంశు

న్యూఢిల్లీ, జూలై 12: యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రా(ఐఎస్‌ఎస్‌)నికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఈ నెల 15న(భారత కాలమానం ప్రకారం) తిరిగి భూమిపై కాలుమోపనున్నారు. ఆ తర్వాత ఆయన ఏడు రోజులపాటు వ్యోమగాముల పునరావాస కేంద్రంలో వైద్యుల పర్యవేక్షణలో గడుపుతారు. ఆయనతోపాటు.. ఇతర వ్యోమగాములు పెగ్గీ విట్సన్‌, స్లావోస్జ్‌ ఉజ్నాన్స్‌కీ-విస్నియొస్కీ, టిబర్‌ కపులుపైనా వైద్యుల పర్యవేక్షణ ఉంటుంది. శుభాంశు, ఇతర వ్యోమగాములు గత నెల 25న నింగిలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే..! దాదాపు రెండు వారాల పాటు ఐఎ్‌సఎ్‌సలో ఉన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 03:36 AM