Plane Crash: షాకింగ్.. విమాన ప్రమాదంపై మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:30 PM
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్‌కు బయల్దేరారు.

ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలంలో సమన్వయంతో సహాయక చర్యలు తీసుకోవాలని రామ్మోహన్ నాయుడు ఎమర్జెన్సీ టీంలను ఆదేశించారు.
విమానం ప్రమాదం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించానని, అహ్మదాబాద్‌కు తాను పయనమయ్యానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో 242 మందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (విమానం AI 171) 232 మంది ప్రయాణికులతో బయలుదేరిందని, వీరిలో 10 మంది సిబ్బంది ఉన్నారని మంత్రి చెప్పారు.
ఈ విమానం లండన్‌కు వెళుతోందని, అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విమానం కూలిపోయిందని వెల్లడించారు. కాగా, ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్‌కు బయల్దేరారు మంత్రి రామ్మోహన్ నాయుడు. డీజీసీఏ, ఎయిరిండియా, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో పరిస్థితిని మంత్రి సమీక్షిస్తున్నారు. ప్రమాదంపై వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని.. సహాయ బృందాలు ఇప్పటికే ఘటనా స్థలంలో ఉన్నాయని మంత్రి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అందుకే వైసీపీ 11 సీట్లకే పరిమితం అయింది..
For National News And Telugu News