Share News

DK Shivakumar: సీఎం మార్పు ఊహాగానాలు... ప్రియాంకను కలిసిన డీకే

ABN , Publish Date - Jul 09 , 2025 | 05:57 PM

ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల తేల్చిచెప్పారు. డీకే, తానూ కలిసి పనిచేస్తున్నామని, పార్టీ ఐక్యంగా ఉందని చెప్పారు. డీకే శివకుమార్ సైతం తనకు మరో దారి లేదని, అధిష్ఠానం నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.

DK Shivakumar: సీఎం మార్పు ఊహాగానాలు... ప్రియాంకను కలిసిన డీకే

న్యూఢిల్లీ: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) బుధవారంనాడు న్యూఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ (Praiyanaka Gandhi)ని కలుసుకున్నారు. కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై కొద్దిరోజులుగా పార్టీలో రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో డీకే సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రియాంకతో సమావేశంపై డీకేను అడిగినప్పుడు 'ఇక్కడకు వచ్చాను' అంటూ క్లుప్తంగా సమాధానం ఇచ్చారు.


ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల తేల్చిచెప్పారు. డీకే, తానూ కలిసి పనిచేస్తున్నామని, పార్టీ ఐక్యంగా ఉందని చెప్పారు. డీకే శివకుమార్ సైతం తనకు మరో దారి లేదని, అధిష్ఠానం నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయానంతరం చెరో రెండున్నరేళ్ల సీఎంగా ఉండేందుకు ఈ ఇద్దరు నేతల మధ్య అవగాహన కుదిరిందనే ప్రచారం మొదట్నించీ జరుగుతోంది. అయితే అలాంటిదేమీ లేదని ఇరువురూ బహిరంగంగా చెబుతున్నప్పటికీ పార్టీ వర్గాల్లో మాత్రం రొటేషనల్ చీఫ్ మినిస్టర్ ఒప్పందంపై ఎడతెగని చర్చ ఇప్పటికీ జరుగుతూనే ఉంది.


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి డీకే శివకుమార్ కీలక భూమిక పోషించారు. అయితే డీకే సేవలను అధిష్ఠానం ప్రశంసిస్తూనే సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పాలన దగ్గర పడుతుండటంతో మళ్లీ సీఎం మార్పు అంశం వేడెక్కుతోంది.


ఇవి కూడా చదవండి..

జస్టిస్ వర్మ అభిశంసనపై సంతకాలు షురూ.!

టోల్‌ ప్లాజా విధ్వంసం.. వీడియో వైరల్

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 09 , 2025 | 05:59 PM