Shashi Tharoor: ఒక్క కారణంతో ఆయన సేవలు తగ్గించడం సరికాదు.. ఆడ్వాణీపై శశిథరూర్ ప్రశంసలు
ABN , Publish Date - Nov 09 , 2025 | 06:58 PM
ఆడ్వాణీ బర్త్‌డే పోస్టులో ఆయనను తాను కలిసినప్పటి పాత ఫోటోను శశిథరూర్ పోస్ట్ చేశారు. నవీన భారతదేశ జర్నీలో ఆడ్వాణీ సేవలు ప్రశంసనీయమని అన్నారు. ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న చెక్కుచెదరని సంకల్పం, వినయం, మర్యాద శ్లాఘనీయమని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: కొద్దికాలంగా మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి దగ్గరవుతున్నారంటూ సొంత పార్టీ కాంగ్రెస్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) తాజాగా బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ ఆడ్వాణీ (LK Adavni)పై ప్రశంసలు కురిపించారు. ఆయన దేశానికి దేశానికి ఎంతో సేవ చేశారనీ, కేవలం ఒక సంఘటన ఆధారంగా దశాబ్దాలుగా ఆయన చేసిన ప్రజాసేవను తక్కువగా అంచనా వేయకూడదని అన్నారు. సామాజిక మాధ్యమం 'ఎక్స్' పోస్టులో ఆడ్వాణీకి 98వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
'కేవలం ఒకే ఘటనతో ఆయన సుదీర్ఘ ప్రజాసేవను తక్కువ చేసి చూపడం అన్యాయం. చైనా దాడితో నెహ్రూజీని, ఎమర్జెన్సీతో ఇందిరాగాంధీ ఏ విధంగా తక్కువ చేసి చెప్పలేమో ఆడ్వాణీ విషయంలోనూ అంతే' అని ఆ పోస్టులో శశిథరూర్ పేర్కొన్నారు.
ఆడ్వాణీ బర్త్‌డే పోస్టులో ఆయనను తాను కలిసినప్పటి పాత ఫోటోను శశిథరూర్ పోస్ట్ చేశారు. నవీన భారతదేశ జర్నీలో ఆడ్వాణీ సేవలు ప్రశంసనీయమని అన్నారు. ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న చెక్కుచెదరని సంకల్పం, వినయం, మర్యాద శ్లాఘనీయమని పేర్కొన్నారు.
కాగా, ఆడ్వాణీని ప్రశంసించడంపై సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే విమర్శించారు. ఆడ్వాణీపై రచయిత-జర్నలిస్టు కుష్వంత్ సింగ్ గతంలో చేసిన 'డ్రాగెన్ సీడ్స్ ఆఫ్ హేట్రెడ్' వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, విద్వేష విత్తనాలు నాడడం ప్రజాసేవ కాదని విమర్శించారు. రామజన్మభూమి ఉద్యమానికి మద్దతుగా జనసమీకరణ కోసం ఆడ్వాణీ 1990లో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకూ రథయాత్ర నిర్వహించారు. 1992 డిసెంబర్‌లో యూపీలోని బాబ్రీ మసీదు కూల్చివేతకు ఆడ్వాణీ సాగించిన రథయాత్రే కారణమంటూ విమర్శలు సైతం వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ సైతం ఆడ్వాణీ రథయాత్రను తప్పుపట్టింది.
ఇవి కూడా చదవండి..
కర్ణాటకలో నాయకత్వ పోరుపై బీజేపీ పేరడీ వీడియో
హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు చేసుకోలేదు.. ఆర్ఎస్ఎస్ చట్టబద్ధతపై మోహన్ భాగవత్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి