Puducherry Coastal Patrol: సముద్రతీర గస్తీకి రోబోలు
ABN , Publish Date - Jul 21 , 2025 | 05:26 AM
సముద్రతీర గస్తీ విధుల్లో పోలీసులకు సాయంగా మొట్టమొదటిసారిగా రోబోలు పాల్గొననున్నాయి.

పుదుచ్చేరిలో ట్రయల్‌రన్ విజయవంతం
పుదుచ్చేరి, జూలై 20(ఆంధ్రజ్యోతి): సముద్రతీర గస్తీ విధుల్లో పోలీసులకు సాయంగా మొట్టమొదటిసారిగా రోబోలు పాల్గొననున్నాయి. పుదుచ్చేరి అసెంబ్లీ భవనం సమీపంలోని సముద్రతీరంలో ఆదివారం పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో రోబోలతో ట్రయల్‌రన్ నిర్వహించారు. సముద్రతీరంలో సేదతీరేందుకు వస్తున్న స్వదేశీ, విదేశీ పర్యాటకులకు మరింత భద్రత కల్పిస్తూ సుమారు 2 కిలోమీటర్ల మేర పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ విధుల్లో పోలీసులకు సహకరించే విధంగా ఆధునిక సాంకేతికతతో రూపొందించిన రోబోల సేవలను వినియోగించుకోవాలని పుదుచ్చేరి పోలీసుశాఖ నిర్ణయించింది. దీనికోసం చెన్నైలోని ఓ ప్రైవేటు ఐటీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని రోబోలను తయారు చేయించారు. ఆ రోబోల పనితీరును తెలుసుకునేందుకు డీఐజీ సత్యసుందరం నేతృత్వంలో ఆదివారం నిర్వహించిన ట్రయల్‌రన్ విజయవంతమైంది. ఈ రోబోలలో పొందుపరిచిన ఆధునిక కెమెరాల ద్వారా సముద్రతీరంలో గస్తీ పనులను పర్యవేక్షిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
For More AndhraPradesh News And Telugu News