Mamata Banejee: మీ ఉద్యోగాలు, జీతాలు సేఫ్.. విధుల్లోకి చేరండి: మమత
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:14 PM
ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది టీచర్లు పశ్చిమబెంగాల్‌లోని సాల్ట్ లేక్‌లో ఉన్న స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్లూబీఎస్ఎస్‌సీ) కార్యాలయం వెలుపల నిరసనలు కొనసాగిస్తున్నారు.

కోల్‌కతా: సుప్రీంకోర్టు తీర్పుతో ఉద్యోగ నియామకాలు రద్దయిన వేలాది మంది టీచర్లకు మరోసారి పశ్చిమబెంగాల్ మఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) భరోసా ఇచ్చారు. నిరసనలకు దిగిన టీచర్లు తిరిగి విధుల్లోకి చేరాలని కోరారు. వారి వేతనాలకు తమ ప్రభుత్వం భరోసాగా ఉంటుందని చెప్పారు.
PM Modi: మోదీ విమానానికి సౌదీ జెట్‌ల ఎస్కార్ట్.. అరుదైన గౌరవం
ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది టీచర్లు పశ్చిమబెంగాల్‌లోని సాల్ట్ లేక్‌లో ఉన్న స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్లూబీఎస్ఎస్‌సీ) కార్యాలయం వెలుపల నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ మరోసారి వారికి ప్రభుత్వ హామీని గుర్తు చేశారు. ''ఎవరు కళంకితులు, ఎవరు కాదనే విషయంలో ఎవరూ ఆందోళన పడకండి. మీ ఉద్యోగం మీకు ఉందా? సకాలంలో జీతాలు వస్తున్నాయా అనేదే ఆలోచించండి. కళంకితులు, కళంకితులు కాని వారి జాబితా ప్రభుత్వం వద్ద, కోర్టుల వద్ద ఉంది'' అని ఆమె తెలిపారు.
''ప్రస్తుతానికి మీ ఉద్యోగాలకు ఢోకా లేదు. మీకు జీతాలు అందుతాయి. దయచేసి మీమీ స్కూళ్లకు వెళ్లండి. క్లాసులు తీసుకోండి. గత రాత్రి నుంచి ఈ మాట నేను చాలా సార్లు చెప్పాను. మేము మీ వెంటే ఉంటాం'' అని సీఎం హామీ ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోయిన గ్రూప్ సి, గ్రూప్ డి సిబ్బందికి సంబంధించి రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేస్తామని, అప్పటి వరకూ ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని ఆమె కోరారు. ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ముర్షీదాబాద్‌లో మే మొదటివారంలో పర్యటిస్తానని కూడా సీఎం ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..