Ravinder Singh Negi: ఏసీలు, టీవీ, కుర్చీలు ఎత్తుకెళ్లిన ఆప్ అగ్రనేత
ABN , Publish Date - Feb 18 , 2025 | 05:48 PM
ప్రతాప్‌గంజ్ ఏరియాలోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆస్తులను మాజీ ఎమ్మెల్యే, కార్యకర్తలు ఎత్తుకెళ్లిపోయారని బీజేపీ ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగి ఆరోపించారు.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మనీష్ సిసోడియా (Sisodia)పై ప్రతాప్‌గంజ్ బీజేపీ ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగి (Ravinder Singh Negi) సంచలన ఆరోపణ చేశారు. ప్రతాప్‌గంజ్ ఏరియాలోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆస్తులను (వస్తువులు) మనీష్ సిసోడియా, ఆప్ కార్యకర్తలు ఎత్తుకెళ్లిపోయారని అన్నారు. ఏసీలు, టెలివిజన్లు, కుర్చీలు, ఫ్యాన్లు, ఎల్‌ఈడీలతో సహా ప్రతీదీ పట్టుకుపోయారని తెలిపారు.
Mamata Banerjee: మహాకుంభ్ 'మృత్యుకుంభ్'గా మారుతోంది... అసెంబ్లీలో మండిపడిన మమత
''ఎన్నికల ముందు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతాప్‌రాజ్‌గంజ్ ఎమ్మెల్యే తన నిజరూపం ప్రదర్శించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుంచి ఏసీ, టీవీ, టేబుల్, చెయిర్, ఫ్యాన్ ఎత్తుకుపోయారు. అవినీతి మరోసారి హద్దులు దాటింది. అలాంటి అవనీతి పరుల గుట్టును బయటపెట్టి ప్రజల హక్కులను మేము కాపాడతాం" అని నెగి అన్నారు. ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కార్యాలయాన్ని చూపిస్తూ సామాజిక మాధ్యమంలో ఒక వీడియో క్లిప్‌ను ఆయన విడుదల చేశారు.
ఆప్ వివరణ
కాగా, దీనిపై పీడబ్ల్యూడీ జేఈ వేద్ ప్రకాష్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే కార్యాలయానికి ఎలాంటి సామగ్రి తాను ఇవ్వలేదని చెప్పారు. సిసోడియా ప్రతినిధి మరింత వివరణ ఇస్తూ, ప్రభుత్వానికి చెందిన వస్తువులేవీ తాము తీసుకెళ్లలేదని చెప్పారు. ఆప్ కార్యకర్తలు తమ సొంత వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటినే తీసుకు వెళ్లారని, మాయమయ్యాయని చెబుతున్న రెండు ఏసీలు కూడా అద్దెకు తెచ్చినవేనని అన్నారు. ఏసీల యజమానులు వాటిని వెనక్కి తీసుకు వెళ్లిపోయారని వివరించారు.
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతాప్ రాజ్ గంజ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నెగి 28,072 ఓట్ల ఆధిక్యంతో ఆప్ నేత అవధ్ ఓఝాపై గెలిచారు. ఇంతకుముందు ప్రతాప్‌రాజ్‌గంజ్ నుంచి గెలిచిన మనీష్ సిసోడియా ఈసారి జాంగ్‌పుర నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Rahul Gandhi: అర్ధరాత్రి నిర్ణయం సరికాదు... సీఈసీ ఎంపికపై రాహుల్
Annamalai : ఆలయాలు ఎలా ఉండకూడదో తమిళనాడులో చూడొచ్చు
Bengaluru: బెంగళూరులో తాగు నీటిని ఇతర అవసరాలకు వాడితే భారీ జరిమానా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.