Rats: ఎలుకలా మజాకా.. బాటిల్స్‌లో ముందు కొట్టేశాయి..!
ABN , Publish Date - Jul 13 , 2025 | 08:27 PM
ఎలుకులు మద్యం తాగేస్తున్నాయి. సీసాలకు సీసాలు అవి ఖాళీ చేసే స్తున్నాయి. వందలాది సీసాలు ఇలా ఖాళీ అయిపోయాయి. అది కూడా మద్యం సీసాల మూతలు నమిలేసి.. అందులోని మద్యం తాగేశాయి.

రాయ్‌పూర్, జులై 13: ఎలుకలు మద్యం తాగుతాయా? అంటే తాగవని అందరు చెబుతారు. కానీ ఈ ఎలుకలు మాత్రం మద్యం తాగేశాయి. అది కూడా ఒకటి.. రెండు.. సీసాలు కాదు.. వందలాది సీసాల్లోని మద్యం గటగట తాగేశాయి. అలాంటి బాహుబలి ఎలుకలు భారతదేశంలో.. అది కూడా జార్ఖండ్‌లో ఉన్నాయి. వైన్ షాపులో దాదాపు 800కు పైగా సీసాల్లోని మద్యం మాయమైంది. సదరు సీసాల్లో మద్యం ఏమైందంటూ తనిఖీలకు వచ్చిన ఎక్సైజ్ అధికారులు వైన్ షాప్ సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో సీసా మూతలను తినేసి.. అందులోని మద్యాన్ని ఎలుకలు గటగటా తాగేశాయంటూ షాప్ సిబ్బంది చెప్పడంతో.. ఎక్సైజ్ అధికారులు మైండ్ బ్లాక్ అయింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం విధానాన్ని అమలు చేయనున్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎంత మద్యం వినియోగించారు. ఇంకా ఎంత సరుకు మార్కెట్‌లో ఉందనే విషయంపై అవగాహన కోసం ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ లెక్కలు చూస్తున్నారు. ఆ క్రమంలో ధన్‌బాద్‌లోని బాలిపూర్, ప్రదాన్ ఖుంథ ప్రాంతాల్లోని వైన్ షాపుల్లో తనిఖీ నిర్వహించగా.. 800కిపైగా మద్యం సీసాలు మాయమైనట్లు గుర్తించారు.
అదికూడా భారత్‌లో తయారైన విదేశీ మద్యం సీసాలు కావడం గమనార్హం. ఈ మద్యం సీసాలు ఏమైనాయంటూ షాపు సిబ్బందిని ప్రశ్నించారు. మద్యం సీసా మూతలు ఎలుకలు నమిలేసి.. అందులోని మద్యాన్ని తాగేశాయంటూ అధికారులకు సిబ్బంది వివరణి ఇచ్చారు. దీంతో సిబ్బందిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పొంతన లేని సమాధానాలంటూ మండిపడ్డారు. మాయమైన మద్యం తాలుకా నగదును ప్రభుత్వానికి చెల్లించాలంటూ షాపు యజమానులకు ఎక్సైజ్ అధికారులు.. నోటీసులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
అమరావతి భూ కేటాయింపులపై సంచలన నిర్ణయం
సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..
కోనసీమ ప్రజలకు గుడ్ న్యూస్: అమలాపురం ఎంపీ
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి