Share News

Raj Bhavan: అవన్నీ అవాస్తవాలు.. ఆ సమావేశం ప్రభుత్వానికి పోటీ కాదు

ABN , Publish Date - Apr 24 , 2025 | 11:59 AM

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాని, గవర్నర్ కార్యాలయమైన రాజ్‌భవన్‌ల మధ్య మళ్ళీ అగాదం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వానికా కొరకురాని కొయ్యగా మారిన గవర్నర్ ఆర్ ఎన్ రవి.. తాజాగా విడుదల చేసిన ప్రకటన పుండుమీద కారం చల్లినట్లుగా మారింది. ఆ ప్రకటన సారాంశాన్ని ఓసారి పరిశీలిస్తే...

Raj Bhavan: అవన్నీ అవాస్తవాలు.. ఆ సమావేశం ప్రభుత్వానికి పోటీ కాదు

- వీసీలతో భేటీపై రాజ్‌భవన్‌ వివరణ

చెన్నై: కేంద్ర, రాష్ట్ర ఉన్నత విద్యా సంస్థల ప్రతినిధులతో ఈ నెల 26వ తేదీ గవర్నర్‌ భేటీ కావడంపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వానికి-రాజ్‌భవన్‌కు మధ్య జరుగుతున్న అధికార పోరాటంలా ఆ సమావేశాన్ని చిత్రీకరిస్తున్నాయని రాజ్‌భవన్‌ ఆరోపించింది.. ఇది ఏమాత్రం పోటీ భేటీ కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం రాజ్‌భవన్‌ ప్రకటన విడుదల చేసింది. 2022 నుంచి ప్రతి ఏడాది ఏప్రిల్‌లో ఉన్నత విద్యా సంస్థల ప్రతినిధుల వార్షిక సమావేశాలను గవర్నర్‌ నిర్వహిస్తున్నారని రాజ్‌భవన్‌(Raj Bhavan) గుర్తు చేసింది.

ఈ వార్తను కూడా చదవండి: Pahalgam: నిఘా వర్గాలు హెచ్చరించినా


ఈ సమావేశాల్లో తమిళనాడు సహా దేశంలో వున్న విద్యా, పారిశ్రామిక ప్రముఖులు పాల్గొని తమ అనుభవాలను పంచుకుంటారని పేర్కొంది. రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాల కోసమే ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. గతంలో ఎన్నడూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు పరస్పరం ఆలోచనలను పంచుకోలేదని పేర్కొంది. ఇది విద్యార్థులకు ప్రతికూలత, హాని చేకూరుస్తుందని అభిప్రాయపడింది. ప్రతి సంవత్సరం సమావేశానికి సన్నాహాలు చాలా నెలల ముందుగానే ప్రారంభమవుతాయని, ఇందులో భాగంగానే జనవరిలోనే ఈ సమావేశాలను ఖరారు చేసినట్లు వివరించింది.


nani1.3.jpg

వాస్తవం ఇలా ఉండగా... ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును అనుసంధానిస్తూ, రాజ్‌భవన్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అధికార పోరాటంగా కొన్ని మీడియా సంస్థలు చిత్రీకరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రూపొందించిన చట్టాల మేరకు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ఛాన్స్‌లర్‌ అయ్యారు.


ఆ వెంటనే ఆయన యూనివర్శిటీల వైస్‌ఛాన్స్‌లర్లతో భేటీ ప్రభుత్వ ఆలోచనలు వివరించి, దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌.. ఉపరాష్ట్రపతితో భేటీ అయిన అనంతరం ఈ నెల 26న ఊటీలో వీసీలతో సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక ఆ సమావేశానికి ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారని గవర్నర్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ముగ్గురు ఇంటర్‌ విద్యార్థినుల ఆత్మహత్య

బిర్యాని.. బీ కేర్‌ఫుల్‌..

చంచల్‌గూడ జైలుకు అఘోరీ

ఫినాయిల్‌, సబ్బుల పైసలు నొక్కేశారు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 24 , 2025 | 12:03 PM