Share News

Rahul Gandhi: ట్రంప్‌ చెప్పింది వాస్తవమే..

ABN , Publish Date - Aug 01 , 2025 | 03:05 AM

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మన దేశ ఆర్థిక, రక్షణ వ్యవస్థలను, విదేశాంగ విధానా న్ని నాశనం చేసిందని కాంగ్రెస్‌

Rahul Gandhi: ట్రంప్‌ చెప్పింది వాస్తవమే..

  • దేశ ఆర్థిక వ్యవస్థ ‘చనిపోయిందని’ అందరికీ తెలుసు!: రాహుల్‌గాంధీ

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మన దేశ ఆర్థిక, రక్షణ వ్యవస్థలను, విదేశాంగ విధానా న్ని నాశనం చేసిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహు ల్‌ గాంధీ ఆరోపించారు. అదానీకి సాయం చేసేందుకే భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని, దేశాన్ని పాతాళానికి తీసుకెళ్తున్నారని విమర్శించారు. పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పినది వాస్తవమే. భారత ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని ప్రధాన మంత్రికి, ఆర్థిక మంత్రికి తప్ప అందరికీ తెలుసు. ట్రంప్‌ ఈ వాస్తవం చెప్పినందుకు ధన్యవాదాలు. మన విదేశాంగ విధానం అద్భుతమంటూ విదేశాంగ మంత్రి ప్రసంగాలు చేస్తుంటారు. మరోవైపు అమెరికా మన దేశాన్ని కించపర్చేలా మాట్లాడుతుంది. చైనా కూడా అలాగే చేస్తుంది. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలకు ప్రతినిధి బృందాలను పంపుతారు. కానీ ఒక్కదేశమూ పాకిస్థాన్‌ను తప్పుపట్టదు. దేశాన్ని ఇలా ఎలా నడిపిస్తున్నారు. వీళ్లకు అసలు దేశాన్ని పాలించడమే రాదు’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ చెప్పినట్టుగా మోదీ ఆడుతున్నారని విమర్శించారు. అనంతరం ‘ఎక్స్‌’లో పోస్టు పెడుతూ.. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ చనిపోయిందని, మోదీయే చంపేశారని ఆరోపించారు. కాగా యుద్ధాన్ని ఆపాలంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించకుండా పార్లమెంటులో మోదీ మౌనవ్రతం పాటించారని.. ఇప్పుడు మృత ఆర్థిక వ్యవస్థ అంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపైనా మౌనంగానే ఉంటారా? అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్

జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2025 | 03:05 AM