PM Modi-Tulasi Gabbard: తులసీ గబ్బార్డ్‌కు గంగాజలం అందించిన మోదీ
ABN , Publish Date - Mar 17 , 2025 | 09:27 PM
ఆదివారంనాడు ఢిల్లీకి వచ్చిన గిబ్బార్డ్ తొలుత ఇంటెలిజెన్స్ సహకారంపై భారత అధికారులతో చర్చించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ అధ్యక్షతన జరిగిన 20 దేశాల ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ అధికాకుల సంయుక్త సదస్సులో పాల్గొన్నారు.

న్యూఢిల్లీ: భారత్ పర్యటనలో ఉన్న అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard) శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు మహాకుంభమేళా నుంచి సేకరించిన పవిత్ర గంగాజలాన్ని ప్రధాని అందజేశారు. ఫిబ్రవరి 26వ తేదీతో ముగిసిన మహాకుంభమేళాలో 66 కోట్ల మందికి పైగా పవిత్రస్నానాలు చేసినట్టు మోదీ ఆమెకు వివరించారు. గిబ్బార్డ్ సైతం నరేంద్ర మోదీకి ఒక రుద్రాక్ష మాలను బహూకరించారు.
PM Modi: ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు.. భారత్-న్యూజిలాండ్ సంయుక్త ప్రకటన
ఆదివారంనాడు ఢిల్లీకి వచ్చిన గిబ్బార్డ్ తొలుత ఇంటెలిజెన్స్ సహకారంపై భారత అధికారులతో చర్చించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ అధ్యక్షతన జరిగిన 20 దేశాల ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ అధికాకుల సంయుక్త సదస్సులో పాల్గొన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సోమవారంనాడు సమావేశమయ్యారు. రక్షణ రంగ బలోపేతంపై చర్చించారు. ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ సహా దాని వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా గిబ్బార్డ్‌ను కోరారు. అమెరికా ఇంటెల్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గిబ్బర్డ్ విదేశాల్లో పర్యటించడం ఇది రెండవసారి. భారత్ పర్యటనకు ముందు జర్మనీలో జరిగిన మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..