Share News

Droupadi Murmu: వేదికపై కంటతడి పెట్టిన ద్రౌపది ముర్ము

ABN , Publish Date - Jun 20 , 2025 | 04:01 PM

ఉత్తరాఖండ్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్ డిసేబిలిటీని సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ, పిల్లలు ఎంతో అందగా పాడుతుంటే భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు.

Droupadi Murmu: వేదికపై కంటతడి పెట్టిన ద్రౌపది ముర్ము
President Droupadi Murmu

డెహ్రాడూన్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) వేదికపైనే భావోద్వేగానికి గురయ్యారు. కంట తడి పెట్టారు. రాష్ట్రపతి 67వ పుట్టినరోజు సందర్భంగా డెహ్రాడూన్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు అంధ విద్యార్థులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ గీతాలు ఆలపించారు. ఈ క్రమంలోనే ద్రౌపది ముర్ము భావోద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.


ఉత్తరాఖండ్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్ డిసేబిలిటీ (ఎన్‌ఐఈపీవీడీ)ని సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ, పిల్లలు ఎంతో అందంగా పాడుతుంటే భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు.‘కన్నీళ్లు ఆగలేదు. పిల్లలు చాలా చక్కగా పాడారు. ఇది వారి హృదయం లోతుల్లోంచి వచ్చిన పాట’ అని అన్నారు.


పుట్టుకతోనే వైకల్యంతో పుట్టిన వారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని, వారిలో ఆత్మవిశ్వాసం నింపి ముందుకు తీసుకువెళ్తే ఒకనాటికి ఖచ్చితంగా వారు సక్సెస్ అవుతారని రాష్ట్రపతి అన్నారు. వైకల్యంతో ఉన్న పిల్లల సాధికారత, సమాన అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం పథకాల రూపకల్పన జరుగుతోందని చెప్పారు. వైకల్యంతో పుట్టిన పిల్లల సాధికారత కోసం పని చేస్తున్న ఎన్‌ఐఈపీవీడీని అభినందించారు. ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ (రిటైర్డ్), ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఆటవిక పాలన నుంచి అభివృద్ధికి బాటలు వేశాం: మోదీ

విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. తిరుగు ప్రయాణం రద్దు

For National News And Telugu News

Updated Date - Jun 20 , 2025 | 06:15 PM