Home » Dehradun
ఉత్తరాఖండ్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్ డిసేబిలిటీని సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ, పిల్లలు ఎంతో అందగా పాడుతుంటే భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు.
రక్షణ ఉత్పత్తులు, ఎగుమతులు లక్ష్యంగా మరింత పటిష్ట, స్వయంసమృద్ధ భారత్‌కు కృషి జరుగుతోందని, ఇదే సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢ వైఖరి తీసుకున్నామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
Rishikesh to Karnaprayag rail line: రుషికేష్ నుంచి కర్ణప్రయాగ్ వరకు 125 కిలోమీటర్ల పొడవుతో రైలు మార్గం ఉంటుంది. ఈ రైలు మార్గం ఎక్కువగా టన్నెళ్ల రూపంలో ఉంటుంది. కేదార్‌నాథ్, బద్రీనాథ్ వెళ్లే భక్తులు ఈ టన్నెళ్లలో ప్రయాణిస్తూ థ్రిల్ పొందొచ్చు.
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్‌వో)కు చెందిన ఓ కార్మిక శిబిరంపై శుక్రవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో మంచు చరియలు విరిగిపడ్డాయి.
ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బర్‌స్టతో కులు, పధార్, మండి, సిమ్లా జిల్లాలను వరద ముంచెత్తింది. 45 మంది గల్లంతవగా.. వీరిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు, బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోయాయి.
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యాత్రికుల ప్రాణాలను బలిగొన్నాయి. శనివారం బద్రీనాథ్ జాతీయ రహదారిపై కర్ణప్రయాగ్‌కు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మేలో ప్రారంభమైన ఉత్తరాఖండ్(uttarakhand)లోని చార్‌ధామ్ యాత్ర(Chardham Yatra)కు ఈసారి గతంలో కంటే రెట్టింపు సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. ఈ క్రమంలో గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్ ప్రాంతాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఈ ఏడాది మృతుల సంఖ్య కూడా పెరిగింది.
Dehradun News: కేదార్‌నాథ్ వెళ్లాలనుకునే భక్తులకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ(BKTC) శుభవార్త చెప్పింది. మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు కేదార్‌నాథ్ ఆలయాన్ని(Kedarnath Dham) తెరవనున్నట్లు ప్రకటించారు. మహాశివరాత్రి(Mahashivratri) సందర్భంగా బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఈ ప్రకటన చేసింది. మే 10వ తేదీన భక్తుల సందర్శనార్థం ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయని తెలిపారు.
కొందరు టూరిస్టులు చిన్నపిల్లలతో అడవిలో సఫారీకి వెళ్లి చేసిన పని చాలా షాకింగ్ గా ఉంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను తాను విష్ణుమూర్తి 11వ అవతారంగా అనుకుంటున్నారని, మతాన్ని రాజకీయాలతో ముడిపెడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిశిత విమర్శలు చేశారు. ప్రజలు ఉదయం లేవగానే దేవీదేవతలు, గురువుల ముఖాలు చూడడానికి బదులు తన ముఖమే చూడాలని ప్రధాని కోరుకుంటున్నారని అన్నారు.