Share News

Bihar Elections: సీనియర్ సిటిజన్లు, 15 ఏళ్ల లోపు పిల్లలకు ప్రశాంత్ కిషోర్ వరాలు

ABN , Publish Date - Jun 30 , 2025 | 08:13 PM

బీహార్‌లోని 60 శాతానికి పైగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ తిరిగి సీఎం అయ్యే ప్రసక్తి లేదని గతవారంలో ప్రశాంత్ కిషోర్ చెప్పారు. మార్పును కోరుకుంటున్న 60 శాతం ప్రజలు ఎవరికి ఓటు వేయనున్నారనేది రాబోయే రోజుల్లో తేలుతుందని అన్నారు.

Bihar Elections: సీనియర్ సిటిజన్లు, 15 ఏళ్ల లోపు పిల్లలకు ప్రశాంత్ కిషోర్ వరాలు

పాట్నా: జన్ సురాజ్ (Jan Suraaj) పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) కీలకమైన ఎన్నికల వాగ్దానాలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరుగనుండటంతో గయలో సోమవారంనాడు ఆయన ప్రచారం సాగించారు. సీనియర్ సిటిజన్లు, 15 ఏళ్ల లోపు పిల్లలకు కీలక హామీలు ఇచ్చారు. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ప్రతినెలా రూ.2,000 పెన్షన్ ఇస్తామని, 15 ఏళ్ల లోపు పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో ఉచిత విద్య అందిస్తామని వాగ్దానం చేశారు. 2025 డిసెంబర్ నుంచే ఈ హామీలు అమలు చేస్తామన్నారు.


60 శాతానికి పైగా ప్రజలు మార్పు కోరుతున్నారు

బీహార్‌లోని 60 శాతానికి పైగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ తిరిగి సీఎం అయ్యే ప్రసక్తి లేదని గతవారంలో ప్రశాంత్ కిషోర్ చెప్పారు. మార్పును కోరుకుంటున్న 60 శాతం ప్రజలు ఎవరికి ఓటు వేయనున్నారనేది రాబోయే రోజుల్లో తేలుతుందని అన్నారు. జన్ సురాజ్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని, తమ పార్టీ నుంచే కొత్త సీఎం వస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాను సీఎం రేసులో లేనని అన్నారు. నితీష్ కుమార్ జేడీయూకు 25 కంటే తక్కువ సీట్లే వస్తాయని, ఆ పార్టీ తన ఉనికి కోల్పోనుందని చెప్పారు. జన్‌ సురాజ్ పార్టీ సొంతంగానే మొత్తం 243 సీట్లలోనూ పోటీ చేస్తుందని, తమ పార్టీలోకి ఎవరు విలీనం కావాలనుకున్నా స్వాగతిస్తామని చెప్పారు. జన్ సురాజ్ పార్టీకి జూన్ 25న ఎన్నికల కమిషన్ 'స్కూల్ బ్యాగ్' గుర్తును కేటాయించింది.


గత ఎన్నికల ఫలితాలు

బీహార్‌లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ సారథ్యంలోని 'మహాఘట్‌బంధన్‌‌' 243 సీట్లలోనూ పోటీ చేసింది. ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేసి 75 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేసి 19 చోట్ల గెలిచింది. సీపీఐ (ఎంఎల్) 19 సీట్లలో 12 గెలిచింది. ఇదే సమయంలో బీజేపీ 74 సీట్లలోనూ, జేడీయూ 43 సీట్లలోనూ గెలుపొందాయి. కాగా, 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్-నవంబర్‌లో జరగాల్సి ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

ప్లాన్ ప్రకారమే లా విద్యార్థినిపై అత్యాచారం.. వెలుగులోకి కొత్త విషయాలు

లలిత్ మోదీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

For National News And Telugu News

Updated Date - Jun 30 , 2025 | 08:17 PM