PM Modi: 77 అడుగుల రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:43 PM
శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్టగాలి జీవోత్తం మఠం తొలి సారస్వత బ్రాహ్మిణ్ వైష్ణణ మఠమని పీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ గోవాలోని పార్టగాలిలో మఠం ప్రధాన కార్యాలయం ఉంది.
గోవా: దక్షిణ గోవా (south Goa) కనకోన (Canacona) పట్టణంలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్టగాలి జీవోత్తం మఠం (Sree Samsthan Gokam Partagali Jeevottam Math)లో ఏర్పాటు చేసిన 77 అడుగుల ఎత్తైన శ్రీరాముని కంచు (Bronze) విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారంనాడు ఆవిష్కరించారు. మఠం 550వ వార్షికోత్సవం సందర్భంగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. సాధువులు, సంతులతో తనకున్న ఆధాత్మిత అనుబంధాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రజలు తమ సంస్కృతితో మమేకమయ్యేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.
మఠం 550వ వార్షికోత్సవంపై ఆర్గనైజేషన్ కమిటీ జాయింట్ కన్వీనర్ ఎస్ ముకుంద్ కామత్ మాట్లాడుతూ, 15,000 మంది ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నారని చెప్పారు. శంకర్ మహదేవన్, అనూప్ జలోటా తదితర ప్రముఖ కళాకారులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్టగాలి జీవోత్తం మఠం తొలి సారస్వత బ్రాహ్మిణ్ వైష్ణణ మఠమని పీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ గోవాలోని పార్టగాలిలో మఠం ప్రధాన కార్యాలయం ఉంది. 13వ శతాబ్దంలో జగద్గురు మధ్వాచార్యులు స్థాపించిన ద్వైత సిద్ధాంతాన్ని ఈ మఠం అనుసరిస్తుందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
దిత్వా తుపాను బీభత్సం.. శ్రీలంకలో 56 మంది మృతి, మోదీ సంతాపం
ఉడిపిలో లక్ష కంఠ గీతా పఠనం.. హాజరైన మోదీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.