Share News

PM Modi: ట్రంప్‌తో మోదీ మీటింగ్ ఫిక్స్.. ఎప్పుడంటే

ABN , Publish Date - Feb 07 , 2025 | 06:15 PM

అమెరికా అధ్యక్షుడిని వచ్చేవారంలో కలుసుకునేందుకు మోదీని ఆహ్వానించినట్టు వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు ఇటీల ప్రకటించిన క్రమంలో మోదీ పర్యటన తేదీలు ఖరారయ్యారు.

PM Modi: ట్రంప్‌తో మోదీ మీటింగ్ ఫిక్స్.. ఎప్పుడంటే

న్యూఢిల్లీ: ప్రధాన నరేంద్ర మోదీ (Narendra Modi) అమెరికా (USA) పర్యటన తేదీలు ఖరారు అయ్యారు. ఫిబ్రవరి 12-13 తేదీల్లో మోదీ అమెరికాలో పర్యటిస్తారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) శుక్రవారంనాడు తెలిపారు. తన పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మోదీ కలుసుకుంటారు.

Election Commission: రాతపూర్వకంగా స్పందిస్తాం.. రాహుల్ ఆరోపణలపై ఈసీ


''ఫిబ్రవరి 12,13 తేదీల్లో ప్రధాని మోదీ అమెరికాలో అధికారిక పర్యటిస్తారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకరాం చేపట్టిన తర్వాత మోదీ జరుపుతున్న తొలి పర్యటన ఇది. ట్రంప్ ప్రమాణస్వీకారం అనంతరం మొదటగా కలుసుకోనున్న కొద్ది మంది ప్రపంచ నేతల్లో మోదీ ఒకరు'' అని మిడియా సమావేశంలో మిస్రీ తెలిపారు. అమెరికా అధ్యక్షుడిని వచ్చేవారంలో కలుసుకునేందుకు మోదీని ఆహ్వానించినట్టు వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు ఇటీల ప్రకటించిన క్రమంలో మోదీ పర్యటన తేదీలు ఖరారయ్యారు.


భారత ప్రధానమంత్రికి తాను ఆతిథ్యం ఇవ్వనున్నట్టు ట్రంప్ గత నెలలో ప్రకటించారు. ''చాలాకాలం తర్వాత ఈరోజు ఉదయం ఫోనులో మాట్లాడాను. బహుశా ఫిబ్రవరిలో ఆయనకు శ్వేతసౌధానికి వచ్చే అవకాశం ఉంది'' అని ట్రంప్ తెలిపారు. గత జనవరి 27న ట్రంప్‌తో మోదీ ఫోనులో సంభాషించారు. అంతర్జాతీయ శాంతి, భర్త, టెక్నాలకీ-ట్రేడ్-డిఫెన్స్ రంగాల్లో అడ్వాన్స్‌డ్ కోఆపరేషన్‌కు తీసుకోవాల్సిన చర్యలపై ఉభయులూ చర్చించారు. అమెరికాతో వాణిజ్య సంబంధాలు పెంచుకోవడంతో పాటు దేశంలోని స్కిల్డ్ వర్కర్లకు వీసాల మంజూరును సులభతరం చేయాలని ప్రధానంగా ఈ పర్యటనలో ట్రంప్‌ దృష్టికి మోదీ తీసుకువచ్చే అవకాశాలున్నాయి.


ఇవి కూడా చదవండి..

AAP: ఆప్ నేతల వ్యాఖ్యలపై జెట్‌స్పీడ్ రియాక్షన్.. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ

Maha Kumbh 2025: మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 07 , 2025 | 06:59 PM