Share News

PM Modi: అయోధ్యలో పర్యటించనున్న మోదీ.. రామాలయంపై పతాకావిష్కరణ

ABN , Publish Date - Nov 24 , 2025 | 05:47 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు వశిష్ట, విశ్వామిత్ర, అగస్త్య, వాల్మీకి, దేవి అహల్య, నిషదరాజు గుహుడు, శబరి మాత మందిరాలతో కూడిన సప్తమందిర్‌ను దర్శిస్తారు. 11 గంటలకు శేషావతార్ మందిర్, మాతా అన్నపూర్ణ మందిరాలను దర్శించుకుంటారు.

PM Modi: అయోధ్యలో పర్యటించనున్న మోదీ.. రామాలయంపై పతాకావిష్కరణ
PM Modi

అయోధ్య: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అయోధ్యలోని రామ జన్మభూమి మందర్‌ను ఈనెల 25న దర్శించనున్నారు. రామాలయ నిర్మాణం పూర్తయినందుకు సంకేతంగా శ్రీరామజన్మ భూమి మందిర శిఖరంపై పతాకాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. ఈ ఘట్టం దేశ సామాజిక-సాంస్కృతిక-ఆధ్యాత్మిక ప్రయాణంలో మరో మైలురాయిగా పేర్కొంటున్నారు. ఇదేరోజు మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో వచ్చే పంచమి కావడం, ఇదే అభిజిత్ ముహూర్తంలో సీతారాముల వివాహ పంచమి కూడా కావడం విశేషం. సిక్కుల తొమ్మదవ గురువు గురుతేజ్‌ బహదూర్ ఆత్మబలిదాన దినోత్సం కూడా ఇదే రోజు వస్తోంది. 17వ శతాబ్దంలో అయోధ్యలో గురుతేజ్ బహదూర్ 48 గంటల సేపు ధాన్యం చేశారు.


సప్తమందిర్‌ను దర్శించనున్న ప్రధాని

ప్రధానమంత్రి మంగళవారం ఉదయం 10 గంటలకు వశిష్ట, విశ్వామిత్ర, అగస్త్య, వాల్మీకి, దేవి అహల్య, నిషదరాజు గుహుడు, శబరి మాత మందిరాలతో కూడిన సప్తమందిర్‌ను దర్శిస్తారు. 11 గంటలకు శేషావతార్ మందిర్, మాతా అన్నపూర్ణ మందిరాలను దర్శించుకుంటారు. రామ దర్బార్ గర్భగృహం, రామలీలా గర్భగృహంలో పూజల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో శ్రీ రామజన్మ భూమి మందిర్ శిఖరంపై కాషాయం రంగు పతాకాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా రామరాజ్యం ఆదర్శాలు, జాతీయ సమైక్యత, భారతదేశ సమున్నత వారసత్వంపై ప్రధాని ప్రసంగిస్తారు.


రామమందిరానికి సహాయం చేసిన దాతలను ఈ వేడుకలకు అధికారికంగా ఆహ్వానించనున్నట్టు ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించింది. దేశం నలుమూలల నుంచి సుమారు 8000 మంది ఆహ్వానితులు ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఢిల్లీలో డీకే విధేయులు.. సీఎం మార్పుపై సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

అధికారిక కారును వదిలి.. రాష్ట్రపతి భవన్ వీడిన మాజీ సీజేఐ

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 24 , 2025 | 05:53 PM