Share News

Modi Musk Call: ఎలాన్‌ మస్క్‌కు ప్రధాని మోదీ ఫోన్‌

ABN , Publish Date - Apr 19 , 2025 | 03:51 AM

ప్రధాని మోదీ శుక్రవారం ఎలాన్‌ మస్క్‌తో ఫోన్‌లో మాట్లాడారు. టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో భారత్-అమెరికా భాగస్వామ్యాలను పెంచుకోవాలని కోరారు

Modi Musk Call: ఎలాన్‌ మస్క్‌కు ప్రధాని మోదీ ఫోన్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18 : ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌తో శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు. టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో భాగస్వామ్యానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా తామిద్దరం భావించినట్లు ప్రధాని ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఈ ఏడాది వాషింగ్టన్‌ డీసీలో తామిద్దరం సమావేశమై మాట్లాడుకున్న అంశాలూ తమ మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపారు. టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో అమెరికాతో మరిన్ని భాగస్వామ్యాలు పెంపొందించుకోవాలని భారత్‌ కృత నిశ్చయంతో ఉందని ప్రధాని మస్క్‌కు వివరించారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాలకవర్గంలో మస్క్‌ కీలకంగా ఉన్నారు. ఆయన సంస్థ టెస్లా భారత్‌లో ఒక ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అంతేగాక మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ద్వారా ‘స్టార్‌ లింక్‌’ అత్యధిక వేగ ఇంటర్‌నెట్‌ సేవలను భారత్‌లో అందించేందుకు రిలయన్స్‌ జియో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.

Updated Date - Apr 19 , 2025 | 03:51 AM