PM Modi: చైనా పర్యటనకు మోదీ.. గల్వాన్ ఘర్షణల తర్వాత ఇదే మొదటిసారి
ABN , Publish Date - Jul 16 , 2025 | 03:43 PM
తియాంజిన్ వేదికగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు ఆగస్టు 31-సెప్టెంబర్ 1 తేదీల్లో జరుగనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతన్, ఎస్‌సీఏ సభ్య దేశాల నేతలు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) త్వరలో చైనా (China)లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో జరుగనున్న షాంఘా కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరవుతారని విశ్వసనీయ వర్గాల కథనం. 2020లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో సైనికుల మధ్య ఘర్షణతో చైనా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు స్తంభించిన అనంతరం చైనాలో మోదీ పర్యటించనుండటం ఇదే ప్రథమం. అయితే మోదీ పర్యటనను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
తియాంజిన్ వేదికగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు ఆగస్టు 31-సెప్టెంబర్ 1 తేదీల్లో జరుగనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతన్, ఎస్‌సీఏ సభ్య దేశాల నేతలు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. కాగా, చైనా పర్యటనలో భాగంగా దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ ఇద్దరు నేతలు చివరిసారిగా 2024 అక్టోబర్‌లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ముఖాముఖీ సమావేశమయ్యారు.
మోదీ పర్యటనకు ముందుగా చైనాలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైంశర్ ఇటీవల పర్యటించారు. ఎస్‌సీఓ సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడిని సైతం ప్రస్తావించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోనూ భేటీ అయ్యారు. గత ఐదేళ్లలో చైనాలో ఆయన పర్యటించడం ఇదే మొదటిసారి.
ఇవి కూడా చదవండి..
కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించండి.. మోదీకి ఖర్గే, రాహుల్ లేఖ
బోయింగ్ విమానాల్లో ఇంధన మీటపై ముందే హెచ్చరించిన యూకే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి