PM Modi: వంట నూనె వాడకాన్ని 10% తగ్గిద్దాం: మోదీ
ABN , Publish Date - Apr 20 , 2025 | 04:36 AM
ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంలో భాగంగా వంట నూనె వాడకాన్ని పది శాతం తగ్గించుకోవడం అనే చిన్న చర్యతో పెద్ద మార్పును చూస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంలో భాగంగా వంట నూనె వాడకాన్ని పది శాతం తగ్గించుకోవడం అనే చిన్న చర్యతో పెద్ద మార్పును చూస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఊబకాయంపై మరింత అవగాహన పెంపొందించడం ద్వారా ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించుకుందామని దేశ ప్రజలకు ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.
ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎక్స్‌లో శుక్రవారం చేసిన పోస్టుకు మోదీ ఈ మేరకు స్పందించారు. కాగా, ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవడంలో భాగంగా రోజు తీసుకునే ఆహారం తయారీలో వాడే వంట నూనె వినియోగాన్ని పది శాతం తగ్గిస్తామని కాలేయ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దామని ప్రజలకు పిలుపునిస్తూ నడ్డా ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.
ఇవి కూడా చదవండి..