Share News

PM Modi On Terrorism: విజయోత్సవాలుగా పార్లమెంటు సమావేశాలు

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:34 AM

ఆపరేషన్‌ సిందూర్‌పై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జరిగే చర్చలో పాలక కూటమి ఎంపీల వైఖరి ఏ విధంగా ఉండాలో ప్రధాని మోదీ ఉద్బోధించారు.

PM Modi On Terrorism: విజయోత్సవాలుగా పార్లమెంటు సమావేశాలు
PM Modi On Terrorism

  • ఆపరేషన్‌ సిందూర్‌ మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జూలై 21: ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జరిగే చర్చలో పాలక కూటమి ఎంపీల వైఖరి ఏ విధంగా ఉండాలో ప్రధాని మోదీ ఉద్బోధించారు. ఈ సమావేశాలను విజయోత్సవాలుగా అభివర్ణించారు. ఈ సెంటిమెంటును పార్లమెంటు సభ్యులు ఏకకంఠంతో తెలియజేయాలని సూచించారు. సోమవారం ఉదయం సమావేశాలు ప్రారంభమవుతాయనగా పార్లమెంటు ప్రాం గణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాలు గర్వించదగినవన్నారు. ‘జాతికి ఇది విజయోత్సవం.ఆపరేషన్‌ సిందూర్‌తో మన సాయుధ బలగాల సామర్థ్యాన్ని ప్రపంచం కళ్లారా చూసింది. లక్ష్యాలను అవి నూరు శాతం సాధించాయి. మన బలగాలు ఆపరేషన్‌ సిందూర్‌తో కేవలం 22 నిమిషాల్లో ఉగ్రవాద బాస్‌లను వారి ఇళ్లలోనే భూస్థాపితం చేశాయి. మేడిన్‌ ఇండియా ఆయుధాల సత్తాను సిందూర్‌ చాటిచెప్పింది. మన ఆయుధ శక్తి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దేశంలో ప్రస్తుతం పలు సానుకూల పరిణామాలు నెలకొన్నాయి. నక్సలిజం శరవేగంగా అంతరిస్తోంది. రెడ్‌జోన్‌ హరిత వృద్ధి జోన్‌గా మారుతోంది. చాలా జిల్లాలు నక్సలిజం గుప్పిట నుంచి బయటకు వచ్చాయి. స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతీయ పతాకం రెపరెపలాడుతోంది’ అని తెలిపారు. ఉగ్రవాదుల యజమాని పాకిస్థాన్‌ ముసుగు తొలగించేందుకు అఖిల పక్ష ఎంపీలు ప్రపంచ దేశాలను సందర్శించి.. ఆపరేషన్‌ సిందూర్‌ అసలు లక్ష్యాన్ని వివరించేందుకు చేసిన కృషిని మోదీ అభినందించారు. రాజకీయ పార్టీలకు వేర్వేరు ఎజెండాలు ఉంటాయని..అయితే జాతీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్న అంశాల్లో ఐకమత్యం అవసరమని సూచించారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత దేశంలో ఐక్యతను తాను చూశానన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 04:34 AM