Share News

Pankaj Chaudhary: ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్‌గా పంకజ్ చౌదరి ఏకగ్రీవ ఎన్నిక

ABN , Publish Date - Dec 14 , 2025 | 03:13 PM

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్, ఇతర నేతల సమక్షంలో పంకజ్ చౌదరి ఎన్నికను పీయూష్ గోయెల్ ప్రకటించారు.

Pankaj Chaudhary: ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్‌గా పంకజ్ చౌదరి ఏకగ్రీవ ఎన్నిక
Pankaj Chaudhary

లక్నో: ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు (UP BJP President)గా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను లక్నోలోని పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ఆదివారంనాడు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి స్థానంలో పంకజ్ చౌదరి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.


బీజేపీ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడిగా పంకజ్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికకావడం సంతోషంగా ఉందని పీయూష్ గోయెల్ తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్, ఇతర నేతల సమక్షంలో పంకజ్ చౌదరి ఎన్నికను గోయెల్ ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పంకజ్ చౌదరి శనివారంనాడు నామినేషన్ వేశారు. ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే అధికారికంగా ఆదివారంనాడు ఆయన ఎన్నికను ప్రకటించారు.


గోరక్‌పూర్‌కు చెందిన పంకజ్ చౌదరి ప్రముఖ కుర్మి సామాజిక వర్గం నేతగా మంచి పేరుంది. ఏడుసార్లు ఎంపీగా ఆయన గెలిచారు. 2022 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కుర్మి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు సమాజ్‌వాదీ పార్టీకి మద్దతు ఇచ్చారు. కాగా, యూపీ రాష్ట్ర చీఫ్‌గా బీజేపీ నుంచి గతంలో పనిచేసిన ఎంపీ వినయ్ కతియార్, మాజీ మంత్రి ఓం ప్రకాశ్ సింగ్, స్వతంత్ర దేవ్ సింగ్‌లు కుర్మి సామాజిక వర్గానికి చెందినవారే కావడం విశేషం. 2027లో ఉత్తప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కుర్మి నేత పంకజ్ చౌదరిని పార్టీ చీఫ్‌గా బీజేపీ ఎన్నికోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


ఇవి కూడా చదవండి..

మెస్సి ఈవెంట్ నిర్వాహకుడు శతద్రుకు బెయిల్ నిరాకరణ

విమానంలో అమెరికా మహిళకు అస్వస్థత.. సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడిన మాజీ ఎమ్మెల్యే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 14 , 2025 | 03:18 PM