Palash Muchhal: ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన పలాశ్ ముచ్చల్
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:38 AM
స్మృతి మందానా పెళ్లి వాయిదా పడిన వారాల తర్వాత పలాశ్ ముచ్చల్ బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమమైన 'శ్రీ హిట్ రాధా కేలి కుంజ్' ఆయనను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రపంచ కప్-2025 విజేత, భారత మహిళ స్టార్ క్రికెటర్ స్మృతి మందాన(Smriti Mandhana)తో సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం వాయిదా పడిన సంగతి తెలిసిందే. స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ మందానకు గుండె నొప్పి రావడంతో పెళ్లి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో స్మృతి మందాన, పలాశ్ వివాహం వాయిదాపై అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి వాయిదా పడిన వారాల తర్వాత పలాశ్ ముచ్చల్ బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్(Premanand Maharaj) ఆశ్రమమైన 'శ్రీ హిట్ రాధా కేలి కుంజ్' ఆయనను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పలాశ్ ముచ్చల్(Palash Muchhal) మాస్క్ ధరించి ఆశ్రమానికి వచ్చినట్లు ఫొటోలో కనిపిస్తుంది. తోటి భక్తుల మధ్యలో ఆయనకు కూడా కూర్చొన్నారు. ప్రేమానంద్ మహారాజ్ ఆశీర్వాదాలు తీసుకున్నట్లు సమాచారం. పెళ్లి వాయిదా తర్వాత పలాశ్ బయట కనిపించడం ఇది రెండోసారి. గత వారం ప్రారంభంలో పలాశ్ ముచ్చల్ ముంబై విమానాశ్రయంలో ఉండగా ఫోటో తీయబడింది. వాహం వాయిదా పడిన తర్వాత ఆయన మొదటిసారి బహిరంగంగా ముంబై ఎయిర్ పోర్టులోనే కనిపించారు. ఆ తర్వాత రెండోసారి ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమంలో తాజాగా కనిపించారు. పలాశ్ ముచ్చల్ వైరల్ లక్షణాలు, అసిడిటీ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్, కాబోయే భర్త పలాశ్ ఇద్దరూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు ఈ జంట వివాహం గురించి ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు. స్మృతి మందాన, పలాశ ముచ్చల్ డిసెంబర్ 7న వివాహం చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ స్మృతి సోదరుడు ఆ పుకార్ల(Mandhana wedding rumours)కు ముగింపు పలికాడు. తన సోదరి వివాహం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపాడు. వివాహం వాయిదా పడిన తర్వాత, స్మృతి మందాన తన వివాహ వేడుక, నిశ్చితార్ధానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల పోస్ట్‌లను తొలగించింది.
ఇవి కూడా చదవండి:
పనితీరు బాగా లేకపోతే ఉద్యోగం పోతుంది.. గంభీర్‌కు రవిశాస్త్రి హెచ్చరిక