Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:33 PM
పహల్గాం దాడి కారణంగా పాకిస్థాన్‌తో సంబంధాలను భారత్ పూర్తిగా తెగతెంపులు చేసుకొంది. ఈ నేపథ్యంలో భారత్‌లో నివసిస్తున్న పాకిస్థానీలను వెంటనే దేశం విడిచి వెళ్లేలా ఆదేశాలు జారీ చేసింది. అందుకు సంబంధించిన గడువు సైతం తీరిపోవచ్చింది. అలాంటి వేళ పాకిస్థాన్‌కు చెందిన మరియం ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేసింది.

లక్నో, ఏప్రిల్ 29: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర ఆంక్షలు విధించింది. దీంతో పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశించింది. అందుకు గడువు సైతం విధించింది. ఆ గడువు ఈ రోజుతో అంటే ఏప్రిల్ 29వ తేదీతో ముగియనుంది. ఆ క్రమంలో ఇప్పటికే చాలా మంది పాకిస్తానీలను భారత్ నుంచి స్వదేశానికి పంపించి వేసింది. అలాంటి వేళ.. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జన్మించి.. ఉత్తరప్రదేశ్‌లో తన భర్తతో నివసిస్తున్న మరియం మంగళవారం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తన భర్తతో కలిసి భారత్‌లోనే నివసించేలా తనకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది.
మూడేళ్ల క్రితం పెళ్లి..
మూడు సంవత్సరాల క్రితం.. బులంద్‌షహర్ జిల్లాలోని ఖుర్జా నివాసి అమీర్‌ను మరియం వివాహం చేసుకుంది. రెండు నెలల క్రితం ఆమె స్వల్పకాలిక వీసా పొంది.. భర్తతో కలిసి ఖుర్జాలో నివసిస్తోంది. తాను ఇస్లామాబాద్ వదిలి భారత్ వచ్చానని తెలిపింది. ప్రస్తుతం ఇది తన దేశమని కేంద్రానికి చేసిన విజ్జప్తిలో స్పష్టం చేసింది. తాను తిరిగి వెళ్లాలనుకోవడం లేదని స్పష్టం చేసింది. గతంలోనే తాను దీర్ఘకాలిక వీసా కోసం దరఖాస్తు చేసినట్లు గుర్తు చేసింది.
పహల్గాం ఘటనపై స్పందన..
మరోవైపు పహల్గామ్ దాడిపై ఈ సందర్భంగా మరియం విచారం వ్యక్తం చేసింది. ఈ ఉగ్రదాడి ఘటన చూసి తాను చాలా కలత చెందనన్నారు. ఈ చర్యకు పాల్పడిన బాధ్యలను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే మరియం పరిస్థితిపై జిల్లా ఎస్పీ తేజ్‌వీర్ సింగ్ స్పందించారు. ఆమె తన దరఖాస్తును తమకు సమర్పించారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
యూపీలో ఉన్న ఒకే ఒక్క..
బులంద్‌షహర్‌లో స్వల్పకాలిక వీసాలపై నివసిస్తున్న నలుగురు పాకిస్తానీ మహిళలను కేంద్రం ఆదేశాల మేరకు ఇప్పటికే వారి దేశానికి పంపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. జిల్లాలో ఉన్న ఏకైక పాకిస్తానీ జాతీయురాలని ఈమెనని వివరించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ జాతీయులను వెనక్కి పంపాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
యూపీ సీఎం ఆదిత్యనాథ్ సమీక్ష..
ఇంకోవైపు.. యూపీ సీఎం ఆదిత్యనాథ్.. ఆ రాష్ట్ర హోం శాఖ ఉన్నతాధికారులో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని నివసిస్తున్న పాకిస్తానీలను గుర్తించి వెంటనే దేశ సరిహద్దుల వరకూ తీసుకెళ్లాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు
PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ
For National News And Telugu News..