Viral News: పాకిస్తాన్‌ను 4 ముక్కలు చేయాలి..ఇలా చేస్తేనే వారికి మేలు..
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:31 PM
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సుబ్రమణ్యస్వామి తాజా ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆ ట్వీట్ ద్వారా పాకిస్తాన్‌ను విచ్ఛిన్నం చేసి, నాలుగు ప్రాంతాలుగా విభజించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, దౌత్యపరమైన వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.

భారత రాజకీయ వేత్త, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సుబ్రమణ్యస్వామి చేసిన తాజా ట్వీట్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్‌పై భారత్ దీర్ఘకాలిక లక్ష్యం ఏంటనేది వెల్లడించారు. ఏప్రిల్ 29, 2025న స్వామి తన అధికారిక X ఖాతాలో, "మన దీర్ఘకాలిక లక్ష్యం పాకిస్తాన్‌ను విచ్ఛిన్నం చేయాలన్నారు. బలూచిస్తాన్, సింధ్, పఖ్తూనిస్తాన్‌లు విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడేలా చేయాలని సూచించారు. దీంతోపాటు పశ్చిమ పంజాబ్ లేదా 'బకిస్తాన్'ను శుత్రు లక్ష్యంగా చేసుకోవాలి" అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ పాకిస్తాన్‌లోని విభజనవాద ఉద్యమాలకు స్వామి సపోర్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అంతేకాదు "బకిస్తాన్" అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా పశ్చిమ పంజాబ్‌ను వ్యంగ్యాత్మకంగా లక్ష్యంగా చేసుకున్నారు.
స్వామి ట్వీట్‌లో కీలక అంశాలు
స్వామి ట్వీట్‌లో పాకిస్తాన్‌ను నాలుగు భాగాలుగా విభజించాలని సూచించారు. బలూచిస్తాన్, సింధ్, పఖ్తూనిస్తాన్, పశ్చిమ పంజాబ్. ఈ నాలుగు ప్రాంతాలలో మొదటి మూడు స్వతంత్ర దేశాలుగా ఏర్పడాలని, మిగిలిన పశ్చిమ పంజాబ్‌ను "బకిస్తాన్" అని సంబోధిస్తూ దానిని శత్రువుగా చూడాలని ఆయన పేర్కొన్నారు. బకిస్తాన్" అనే పదాన్ని వ్యంగ్యాత్మకంగా చెప్పారు. ఇది పాకిస్తాన్‌ను బలహీనపరిచే ఉద్దేశంతో చేసినట్లుగా అనిపిస్తుంది. ఈ వ్యాఖ్యలు భారత్-పాకిస్తాన్ సంబంధాలలో ఉన్న ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం పెరిగింది.
స్వామి చెప్పింది నిజమేనా
స్వామి ఈ ట్వీట్‌లో బలూచిస్తాన్, సింధ్, పఖ్తూనిస్తాన్‌లలోని విభజనవాద ఉద్యమాలకు స్పష్టమైన మద్దతు ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న అసంతృప్తి స్వాతంత్ర్య ఉద్యమాలను ఆయన తన వ్యాఖ్యలతో సపోర్ట్ చేశారు. బలూచిస్తాన్‌లో బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) వంటి సంస్థలు పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నాయి. అయితే సింధ్, పఖ్తూనిస్తాన్‌లోనూ స్వాతంత్ర్య భావనలు బలంగా ఉన్నాయి. స్వామి ఈ ఉద్యమాలను బహిరంగంగా సమర్థించడం ద్వారా పాకిస్తాన్‌లో అంతర్గత విభేదాలను ప్రోత్సహించే లక్ష్యాన్ని సూచించారని చెప్పవచ్చు. దీన్ని బట్టి చూస్తే స్వామి చేసిన ట్వీట్ నిజమే అనే భావన కలుగుతుంది.
స్వామి గత వ్యాఖ్యలు కూడా..
సుబ్రమణ్యస్వామి గతంలో కూడా పాకిస్తాన్ విభజనకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. 2018లో ఆయన Xలో "పాకిస్తాన్‌తో చర్చలు నిరర్థకం, దానిని నాలుగు ముక్కలుగా విభజించడమే ఏకైక పరిష్కారం" అని పేర్కొన్నారు. ఇటీవల, 2025 ఏప్రిల్‌లో ఆయన బలూచిస్తాన్, సింధ్, పఖ్తూనిస్తాన్, ఈస్ట్ పంజాబ్‌గా పాకిస్తాన్‌ను విభజించాలని, ఇది హిందూ-ముస్లిం శాంతికి దారితీస్తుందని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లు స్వామి స్థిరమైన భావజాలాన్ని ప్రతిబింబిస్తాయి. అంతేకాదు ఇది పాకిస్తాన్‌ను బలహీనపరచడం ద్వారా భారతదేశ భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో అన్నట్లు కనిపిస్తుంది.
మరోవైపు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా బలూచిస్తాన్ స్వాతంత్ర్య ఉద్యమం కారణంగా పాకిస్తాన్ నుంచి విడిపోయే అవకాశం ఉందని ఇటీవల పేర్కొన్నారు. అలాగే, బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే 2025 నాటికి పాకిస్తాన్ బలూచిస్తాన్, పఖ్తూనిస్తాన్, పంజాబ్‌గా విడిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవలి ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఇది మరింత త్వరగా జరిగే అవకాశం ఉందనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి:
కశ్మీర్‌లో ఐదో రోజూ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన పాకిస్తాన్
వేడి నుంచి ఉపశమనం..ఈ ప్రాంతాల్లో మే 3 వరకు వర్షాలు..
మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Read More Latest Telugu News and National News