Share News

Trade Ban Bypass: దాయాది దొంగ బుద్ధి

ABN , Publish Date - May 06 , 2025 | 03:36 AM

భారత్‌ విధించిన వాణిజ్య నిషేధాన్ని దాటిచెళ్లేందుకు పాక్‌ కొత్త కుట్రకు తెరలేపింది. యూఏఈ, సింగపూర్‌, ఇండోనేసియా వంటి దేశాల ద్వారా ఉత్పత్తులను రీప్యాక్‌ చేసి భారత్‌కు గుట్టుగా పంపిస్తోంది

Trade Ban Bypass: దాయాది దొంగ బుద్ధి

  • వేరే దేశాల మీదుగా భారత్‌కు సరుకులు

న్యూఢిల్లీ, మే 5: ఉగ్రవాదానికి ఊతమిస్తూ పెడదారి పట్టిన పాకిస్థాన్‌.. భారత్‌ తనపై విధించిన వాణిజ్య నిషేధాన్ని అధిగమించడానికి అడ్డదారిని ఎంచుకుంది. నేరుగా మనదేశానికి తన ఉత్పత్తులను పంపే అవకాశం లేకపోవడంతో.. యూఏఈ, సింగపూర్‌, ఇండోనేసియా, శ్రీలంక తదితర దేశాల గుండా పంపుతోందని ఒక అధికారి వెల్లడించారు. పాకిస్థాన్‌ నుంచి వచ్చే పండ్లు, ఎండు ఖర్జూరాలు, తోలు ఉత్పత్తులు, వస్త్రాల వంటివాటిని యూఏఈ రీప్యాక్‌, రీలేబుల్‌ చేసి భారత్‌కు పంపుతోందని ఆ అధికారి తెలిపారు. కొన్నిరకాల రసాయనాలను సింగపూర్‌ ద్వారా.. సిమెంట్‌, సోడా యాష్‌, వస్త్రాలకు సంబంధించిన ముడిపదార్థాలను ఇండోనేసియా ద్వారా పంపుతోందని వివరించారు. భారత్‌ నిషేధం విధించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలా దాదాపుగా రూ.4,200 కోట్ల విలువైన ఉత్పత్తులను పాక్‌ భారత్‌కు పంపినట్టు సమాచారం


Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్‌ గాంధీ భేటీ

Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

India vs Pakistan Missile Power: భారత్‌తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..

Updated Date - May 06 , 2025 | 03:36 AM