Rahul letter to PM: పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధానికి రాహుల్ లేఖ
ABN , Publish Date - Apr 29 , 2025 | 10:32 AM
Rahul letter to PM: ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో వెంటనే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి (PM Narendra Modi) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (AICC President Mallikarjun Kharge), లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లేఖ రాశారు. అత్యవసరంగా పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఎల్లప్పుడూ కలిసి నిలబడతామని చూపించాలని లేఖలో రాహుల్ కోరారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి నివాళులర్పించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భారత పార్లమెంటు సాక్షిగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని లేఖలో తెలిపారు.
కాగా.. పహల్గామ్ దాడి జరిగిన వెంటనే తర్వాతి రోజు సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం కూడా చేశారు. భారత ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు తాము మద్దతుగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత జరిగిన అఖిల పక్ష సమావేశానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఆ సమావేశంలో భారత ప్రభుత్వం చేపట్టే చర్యలన్నింటికీ మద్దతుగా ఉంటామని, వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. అయితే ఆ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరుకాకపోవడాన్ని మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు.
Canada Election Results: కెనడా ఎన్నికల ఫలితాల్లో ఎవరు ముందున్నారు.. ఎవరు గెలుస్తారు
ఇటువంటి ముఖ్యమైన సమావేశానికి ప్రధాని మోదీ వచ్చి అక్కడ జరిగిన సంఘటనలను వివరించి ఉంటే బాగుండేదని, ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రధాని మోదీ పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీఎంసీ నేత సుధీప్ బందోపాధ్యాయ, ఆప్ నేత సంజయ్ సింగ్ కూడా ఈ దాడి ఘటన భద్రతా లోపాలను చూపిస్తోందని.. ఈ క్రమంలో భద్రతా లోపాలు ఎందుకు జరిగాయి.. వాటిని ఏ విధంగా సరిచేస్తున్నారు అనే దానిపై ప్రధాని మోదీ జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రాజ్యసభ సభ్యులు కపిల్ సిబల్ కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఉగ్రవాదంపై దేశం ఏకమైందని.. ప్రపంచానికి సందేశం ఇవ్వడానికి పార్లమెంటులో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని లేఖలో కోరారు. ఇప్పుడు తాజాగా ఖర్గే, రాహుల్ రాసిన లేఖపై ప్రధాని మోదీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి
Yoga For Migraine: తరచూ తల భారంగా ఉంటోందా.. ఈ యోగాసనాలతో శాశ్వత పరిష్కారం..
Hyderabad: నా కోరిక తీర్చు... లేదంటే కుటుంబంపై యాసిడ్ పోస్తా
Read Latest National News And Telugu News