Pahalgam Attack: రక్షణ మంత్రి, ఎన్ఎస్ఏ, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌తో మోదీ కీలక సమావేశం
ABN , Publish Date - Apr 29 , 2025 | 07:03 PM
జాతీయ భద్రతాంశాలపై విధాన నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ బుధవారంనాడు కీలక సమావేశం జరుపనుంది. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించనున్నారు. ఈ కీలక సమావేశానికి ముందుగానే మోదీ నివాసంలో త్రివిధ దళాధిపతులు, అజిత్ దోవల్ తదితరులు మంగళవారం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గతవారంలో 26 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మంగళవారం సాయంత్రం తన నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్రివిధ దళాధి పతులు జనరల్ ఉపేంద్ర ద్వివేది (ఆర్మీ), అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి (నేవీ), అమర్ ప్రీత్ సింగ్ (ఎయిర్‌ఫోర్స్) సైతం హాజరయ్యారు.
Pahalgam Terror Attack: హోం శాఖ కార్యాలయంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం
జాతీయ భద్రతాంశాలపై విధాన నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ బుధవారంనాడు కీలక సమావేశం జరుపనుంది. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించనున్నారు. ఈ కీలక సమావేశానికి ముందుగానే మోదీ నివాసంలో త్రివిధ దళాధిపతులు, అజిత్ దోవల్ తదితరులు మంగళవారం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితిపై ప్రధానమంత్రికి సోమవారంనాడు సుమారు 40 నిమిషాల పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధానమంత్రికి వివరించారు.
ఎంహెచ్ఏ కార్యాలయంలో..
కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు, భద్రతపై సమీక్షించేందుకు హోం మంత్రిత్వ శాఖ (MHA) కార్యాలయంలో మంగళవారం సాయంత్రం అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. దీనికి హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షత వహించారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), సహస్ర సీమ బల్ (ఎస్ఎస్‌బీ), ఇండో-టిబిటెన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ), అసోం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..