పద్మశ్రీ అవార్డు గ్రహీత కార్తీక్ మహారాజ్ నన్ను రేప్ చేశారు.. అబార్షన్ చేయించారు
ABN , Publish Date - Jun 29 , 2025 | 04:13 AM
పద్మశీ అవార్డు గ్రహీత, భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన సాధువు కార్తీక్ మహారాజ్ (స్వామీ ప్రదీప్తానంద) టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనపై 2013 నుంచి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించింది.

బెంగాల్ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు
కోల్‌కతా, జూన్ 28: పద్మశీ అవార్డు గ్రహీత, భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన సాధువు కార్తీక్ మహారాజ్ (స్వామీ ప్రదీప్తానంద) టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనపై 2013 నుంచి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించింది. ఆయన వల్ల గర్భం దాల్చిన తనకు బలవంతంగా అబార్షన్ చేయించారని తెలిపింది. కార్తీక్ మహారాజ్ పశ్చిమ బెంగాల్‌లోని ముషీరాబాద్ జిల్లా బేల్‌ఢాంగా ఆశ్రమానికి అనుబంధంగా ఉన్నారు. 2012 డిసెంబరులో ఆయనను కలిశానని, ఆశ్రమానికి చెందిన ఆదివాసీ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారని బాధితురాలు నబాగ్రామ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 2013 జనవరిలో తనకు పాఠశాల హాస్టల్‌లో బస కల్పించారని, అప్పటి నుంచి కార్తీక్ మహారాజ్ పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఈ ఆరోపణలను కార్తీక్ మహారాజ్ ఖండించారు.