Pahalgam Terror Attack: ఎమ్మెల్యేతో సహా 30 మంది అరెస్ట్
ABN , Publish Date - Apr 30 , 2025 | 08:18 AM
Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భారత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.

అసోం, ఏప్రిల్ 30: పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన 30 మందిని అరెస్ట్ చేసినట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ వెల్లడించారు. వీరంతా పాకిస్థాన్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు చేశారన్నారు. వీరి గత చరిత్రను పరిశీలించి.. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. పాక్, భారత్‌ల మధ్య సారూప్యత లేదన్నారు. ఈ రెండింటి మధ్య వైరం ఉందని గుర్తు చేశారు.
ఈ అరెస్టయిన వారిలో అసోం, మేఘాలయా, త్రిపుర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఉన్నారన్నారు. తొలుత 24 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. వీరిలో ఎమ్మెల్యేతోపాటు విద్యార్థులు, పాత్రికేయులు, ఉపాధ్యాయులు సైతం ఉన్నారని వివరించారు. అయితే 2019 పుల్వామా దాడి ఘటన నుంచి ఇటీవల చోటు చేసుకున్న పహల్గాం ఉగ్రదాడి వరకు అన్ని ప్రభుత్వం కుట్రలంటూ ఆరోపణలు గుప్పించిన తమ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంపై ఇప్పటికే దేశద్రోహం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ ఉగ్రదాడిపై మోదీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులోభాగంగా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ దేశంతో చేసుకున్న సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. అంతేకాదు.. ఈ ఘటన తర్వాత సైన్యాన్నికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించింది.
ఇవి చదవండి..
Fire Accident: అగ్నిప్రమాదం 14 మంది సజీవ దహనం
Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..
Viral News: పాకిస్తాన్‌ను 4 ముక్కలు చేయాలి..ఇలా చేస్తేనే వారికి మేలు..
For National News And Telugu News
Fire Accident: అగ్నిప్రమాదం 14 మంది సజీవ దహనం