Share News

Siddaramaiah: ఐదేళ్లు పక్కా... సీఎం, డిప్యూటీ సీఎం ఐక్యతారాగం

ABN , Publish Date - Jun 30 , 2025 | 04:02 PM

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర ఇన్‌చార్జి రణ్‌దీప్ సూర్జేవాలా రాష్ట్రానికి రావడంపై సిద్ధరామయ్య మాట్లాడుతూ, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడంపై సూర్జేవాలా దృష్టి సారించనున్నట్టు చెప్పారు. పార్టీని పటిష్టం చేయడం కోసం వచ్చారని, ఆయన పని ఆయన చేస్తారని తెలిపారు.

Siddaramaiah: ఐదేళ్లు పక్కా... సీఎం, డిప్యూటీ సీఎం ఐక్యతారాగం

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో విభేదాలున్నాయనే ఊహాగానాలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) కొట్టివేశారు. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని స్పష్టం చేశారు. చేతులు కలిపి ఐక్యతను చాటుకున్నారు. సోమవారంనాడు మీడియా సమావేశంలో ఇద్దరు నేతలూ కలిసి పాల్గొన్నారు.


'మా ప్రభుత్వం ఐదేళ్ల పాటు దృఢంగా ఉంటుంది. మేము కలిసికట్టుగా ఉన్నాం, కలిసే పనిచేస్తాం' అని సిద్ధరామయ్య తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్‌లో గొడవలు ఉన్నాయనే ఊహాగానాలను ఆయన కొట్టివేశారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర ఇన్‌చార్జి రణ్‌దీప్ సూర్జేవాలా రాష్ట్రానికి రావడంపై మాట్లాడుతూ, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడంపై సూర్జేవాలా దృష్టి సారించనున్నట్టు చెప్పారు. పార్టీని పటిష్టం చేయడం కోసం వచ్చారని, ఆయన పని ఆయన చేస్తారని తెలిపారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలను సిద్ధరామయ్య ప్రారంభించడం లేదంటూ విపక్ష నేత ఆర్.అశోక చేసిన వ్యాఖ్యలపై సిద్ధరామయ్య మండిపడ్డారు. 'బీజేపీ ఒక అబద్ధాల పుట్ట. వాళ్ల పని అదే. డీకే శివకుమార్, నేనూ కలిసే ఉన్నాం. ఈ ప్రభుత్వం ఐదేళ్లు స్థిరంగా పనిచేస్తుంది. బీజేపీ కామెంట్లను మేము పట్టించుకునేది లేదు' అని అన్నారు.


ఖర్గే ఏమి చెప్పారు?

ముఖ్యమంత్రి పదవి అనేది అధిష్ఠానం నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దీనిపై ఎవరూ మాట్లాడేది ఉండదని, తదుపరి చర్య తీసుకునే హక్కు అధిష్ఠానానికే విడిచిపెట్టాలని అన్నారు. ఏ ఒక్కరూ అనవసరమైన సమస్యలు సృష్టంచరాదని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

జూలై 2 నుంచి హైదరాబాద్‌ - కన్నియాకుమారి మధ్య ప్రత్యేక రైళ్లు

యాప్‌ల్లో ఇచ్చే ఫోన్‌ నంబర్లకు సర్కారీ ధ్రువీకరణ తప్పనిసరి

For National News And Telugu News

Updated Date - Jun 30 , 2025 | 04:06 PM