Leader of the Opposition: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. రెండేళ్లుగా క్వార్టర్స్ ఇవ్వలేదు
ABN , Publish Date - Jul 17 , 2025 | 01:03 PM
ప్రతిపక్షనేతగా రెండేళ్లుగా కొనసాగుతున్నా క్వార్టర్స్ కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ పాలకులకు ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత లేదని ప్రతిపక్షనేత ఆర్ అశోక్ మండిపడ్డారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ శివమొగ్గ జిల్లా సిగందూరులో కేబుల్ బ్రిడ్జ్ నిర్మించిన ఘనత బీజేపీకి దక్కుతుందని ఖంగుతిన్న ముఖ్యమంత్రి వివాదం చేస్తున్నారన్నారు.

- ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ప్రతిపక్షనేత అశోక్
బెంగళూరు: ప్రతిపక్షనేతగా రెండేళ్లుగా కొనసాగుతున్నా క్వార్టర్స్ కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ పాలకులకు ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత లేదని ప్రతిపక్షనేత ఆర్ అశోక్(Opposition Leader R Ashok) మండిపడ్డారు. బెంగళూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శివమొగ్గ జిల్లా సిగందూరులో కేబుల్ బ్రిడ్జ్ నిర్మించిన ఘనత బీజేపీకి దక్కుతుందని ఖంగుతిన్న ముఖ్యమంత్రి వివాదం చేస్తున్నారన్నారు.
ప్రతిపక్షనేత హోదా రాజ్యాంగబద్ధమైనదని అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ఇప్పటివరకు 6 సార్లు లేఖ రాశానని, క్వార్టర్స్ ఎలా ఉన్నా కనీసం వివరణ కూడా ఇవ్వడం లేదన్నారు. సిగందూరు బ్రిడ్జ్ ప్రారంభానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించారన్నారు. కానీ ఆయనకు ముందస్తు కార్యక్రమాల నిర్ణయంతో వెళ్లలేదన్నారు. రాష్ట్రప్రభుత్వం ఎక్కడైనా ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేల సలహాలు లేదా కార్యక్రమాలలో పాల్గొనేలా అవకాశం కల్పించారా? అని ప్రశ్నించారు. రెండేళ్లకాలంలో ప్రతిపక్షనేతగా నన్ను ఒక్క కార్యక్రమానికి కూడా పిలవలేదన్నారు.
రాష్ట్రంలో రణదీప్ సుర్జేవాలా పాలన
రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య పాలనపై సంపూర్ణంగా విశ్వాసం కోల్పోయారని, ఆయన లాటరీ దక్కినట్టుగా హోదా వచ్చిందని అందుకే కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్రంలో రణదీప్ సింగ్ సుర్జేవాలా పాలన అమలుకు సిద్ధమైందని ప్రతిపక్షనేత అశోక్ మండిపడ్డారు. బుధవారం ఎక్స్ వేదికగా పలు అంశాలు ప్రస్తావించారు. మంగళవారం 11మంది కాంగ్రెస్ మంత్రులను సుర్జేవాలా సభ జరిపిన అంశంపై మండిపడ్డారు. గురువారం కేబినెట్ భేటీకి సుర్జేవాలా అధ్యక్షత వహిస్తారా..? అంటూ ఎద్దేవా చేశారు. కేపీసీసీ కార్యాలయం, స్టార్ హోటళ్లలో అసంతృప్తి ఎమ్మెల్యేలు పలు అంశాలు సుర్జేవాలాకు తెలిపారన్నారు.
మంత్రుల సాధనలు ఆలకించే సుర్జేవాలా కేబినెట్ భేటీకి అధ్యక్షత వహించినా ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. సిద్దరామయ్యకు పాలనపై పట్టులేదని ఆరోపించారు. డీసీఎం డీకే శివకుమార్‌కు ఎమ్మెల్యేల మద్దతు లేదని, తమకు అనుకూలమైనవారిని ముఖ్యమంత్రిగా నియమించేందుకు రాహుల్‌కు శక్తి లేదని వ్యంగ్యం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి స్థానాన్ని సమర్థవంతంగా నిర్వహించే ఒక నాయకుడు కూడా లేకుండా పోయాడని, హైకమాండ్ త్రిశంకుస్వర్గంలోకి చేరిందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తాటి చెట్టే లేదు.. లక్షల లీటర్ల కల్లా..
Read Latest Telangana News and National News