Parliament Disruption: ఎస్‌ఐఆర్‌పై చర్చించాల్సిందే
ABN , Publish Date - Aug 01 , 2025 | 02:57 AM
బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్

కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళనలు
పార్లమెంటు ఉభయసభల వాయిదా
న్యూఢిల్లీ, జూలై 31: బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- ఎస్‌ఐఆర్)పై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు చేపట్టిన ఆందోళనలతో పార్లమెంట్ ఉభయసభలు గురువారం స్తంభించిపోయాయి. పలుమార్లు వాయిదాలు పడుతూ కొనసాగిన సభలు ఎలాంటి చర్చలు లేకుండానే శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ఇస్రో, నాసా సంయుక్తంగా నైసార్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడంతో ఆయా శాస్త్రవేత్తలకు పార్లమెంట్ ఉభయసభలు శుభాకాంక్షలు తెలియజేశాయి. మరోపక్క, రాజ్యసభలోనూ తీవ్ర గందరగోళం కొనసాగింది. ఎస్‌ఐఆర్ అంశంతోపాటు ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని మోదీ రాజ్యసభకు బదులివ్వలేదంటూ ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. నినాదాలతో సభను హోరెత్తించాయి. ప్రధాని మోదీ సభకు వచ్చి మాట్లాడాలని పట్టుబట్టాయి. ఆందోళనలు కొనసాగుతుండడంతో రాజ్యసభను కూడా శుక్రవారానికి వాయిదా వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News