Special trains: ఓనం సందర్భంగా ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Aug 02 , 2025 | 10:45 AM
ఓనం పండుగను పురస్కరించుకుని చెన్నై సెంట్రల్-కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.06119 చెన్నై సెంట్రల్-కొల్లం వారాంతపు ప్రత్యేక రైలు ఈ నెల 27, సెప్టెంబరు 3,10 తేదీల్లో చెన్నై సెంట్రల్ నుంచి మధ్యాహ్నం 3.10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.40 గంటలకు కొల్లం చేరుకుంటుంది.

చెన్నై: ఓనం పండుగ(Onam festival)ను పురస్కరించుకుని చెన్నై సెంట్రల్-కొల్లం(Chennai Central-Kollam) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నెం.06119 చెన్నై సెంట్రల్-కొల్లం వారాంతపు ప్రత్యేక రైలు ఈ నెల 27, సెప్టెంబరు 3,10 తేదీల్లో చెన్నై సెంట్రల్ నుంచి మధ్యాహ్నం 3.10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.40 గంటలకు కొల్లం చేరుకుంటుంది.
మరుమార్గంలో, నెం.06120 కొల్లం చెన్నై సెంట్రల్ వారాంతపు ప్రత్యేక రైలు ఈ నెల 28, సెప్టెంబరు 4,11 తేదీల్లో కొల్లంలో ఉదయం 10.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు వేకువజామున 3.30 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. ఈ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్ శనివారం ప్రారంభమైందని దక్షిణ రైల్వే తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్.. ఎంతకు చేరాయంటే
సైబర్ నేరగాళ్ల సరికొత్త ఎత్తులు!
Read Latest Telangana News and National News