Nitish Kumar: ఫ్లవర్ పాట్‌తో స్వాగతం పలికితే.. నితీష్ ఏం చేశారో చూడండి
ABN , Publish Date - May 26 , 2025 | 07:31 PM
బీహార్ సీఎం నితీష్ కుమార్ అడపాదడపా పబ్లిక్ కార్యక్రమాల్లో తనదైన ప్రత్యేక శైలి ప్రదర్శిస్తుంటారు. ఇది అక్కడున్న వారికి తొలుత ఆశ్చర్యం కలిగించినా ఆ తర్వాత వాతావరణం నవ్వులతో ఆహ్లాదకరంగా మారిపోతుంటుంది.

పాట్నా: రాజకీయ నాయకులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు సహజంగానే వేదకలపై ఒకింత గంభీరంగా ఉంటారు. అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) మాత్రం అడపాదడపా ఇలాంటి సందర్భాల్లో ఇందుకు భిన్నంగా తనదైన ప్రత్యేక శైలి ప్రదర్శిస్తుంటారు. ఇది అక్కడున్న వారికి తొలుత ఆశ్చర్యం కలిగించినా ఆ తర్వాత వాతావరణం నవ్వులతో ఆహ్లాదకరంగా మారిపోతుంటుంది. అలాంటి అహ్లాదకర సంఘటనే సోమవారంనాడు పాట్నాలోని లలిత్ నారాయణ్ మిశ్రా ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకుంది.
నితీష్ కుమార్‌కు విద్యాశాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ (ఏసీఎస్) ఎస్.సిద్ధార్ధ సాదరపూర్వక స్వాగతం పలుకుతూ ఒక ఫ్లవర్ పాట్‌ను అందజేశారు. దానిని నితీష్ అందుకుంటూనే తిరిగి ఆ ఫ్లవర్ పాట్‌ను ఏసీఎస్ తలపై ఉంచారు. దీంతో ఏసీఎస్‌తో పాటు వేదికపై ఉన్న ప్రముఖులు, ఆడియెన్స్ ఆశ్చర్యానికి గురయ్యాయి. అయితే నితీష్ సంప్రదాయంగా అనుసరించే మేనజరిజం బాగా తెలిసిన వారంతా వెంటనే తేరుకుని హాయిగా నవ్వేయడంతో వాతావరణం ఒక్కసారిగా అహ్లాదంగా మారింది. తన తలపై ఉంచిన ఫ్లవర్ పాట్‌ను ఏసీఎస్ పొదివిపట్టుకుని ముందుకు కదలడంతో కార్యక్రమం అహ్లాదంగా మొదలైంది.
ఇవి కూడా చదవండి..
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్
ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
For National News And Telugu News