Share News

Women Reservation: ఎన్నికల వేళ మహిళలకు సీఎం భారీ బొనంజా

ABN , Publish Date - Jul 08 , 2025 | 03:29 PM

ఎంపిక చేసిన ప్రభుత్వ సర్వీసులలో బీహార్‌లోని మహిళలకు ఇప్పటికే రిజర్వేషన్ ఉండగా, తాజా నిర్ణయం ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు, రిక్రూట్‌మెంట్ స్థాయిలలో శాశ్వత నివాసిత మహిళలకు 35 శాతం కోటా వర్తిస్తుంది.

Women Reservation: ఎన్నికల వేళ మహిళలకు సీఎం భారీ బొనంజా
Nitish kumar

పాట్నా: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో మహిళా సాధికారత, ఉద్యోగాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitihs Kumar) సంకేతాలిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నేరుగా జరిగే అన్ని రిక్రూట్‌మెంట్లలో బీహార్‌ స్థానికత కలిగిన మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు మంగళవారంనాడు ప్రకటించారు. రాష్ట్ర క్యాబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది.


ఎంపిక చేసిన ప్రభుత్వ సర్వీసులలో బీహార్‌లోని మహిళలకు ఇప్పటికే రిజర్వేషన్ ఉండగా, తాజా నిర్ణయం ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు, రిక్రూట్‌మెంట్ స్థాయిలలో శాశ్వత నివాసిత మహిళలకు 35 శాతం కోటా వర్తిస్తుంది.


యూత్ కమిషన్

బీహార్ యూత్ కమిషన్ ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఉద్యోగావకాశాలు పెంచడం, వొకేషనల్ ట్రైనింగ్, రాష్ట్రంలోని యువతకు సపోర్ట్‌గా నిలబడే లక్ష్యంతో ఈ యూత్ కమిషన్ ఏర్పాటు కానుంది. యువతకు సంబంధించిన విధానాలు, అభివృద్ధి పథకాల్లో అడ్వైజరీగా కమిషన్ వ్యవహరిస్తుందని నితీష్ కుమార్ తెలిపారు. నాణ్యమైన విద్య, నైపుణ్యాలు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో జాబ్ ప్లేస్‌మెంట్‌ను మెరుగుపరచేందుకు వివిధ శాఖలతో కమిషన్ సమన్వయం చేస్తుందని చెప్పారు. ఈ కమిషనల్‌లో ఒక చైర్మన్, ఇద్దరు వైస్ చైర్మన్లు, ఏడుగురు సభ్యులు (45 ఏళ్లలోపు వారు) ఉంటారు.


ఇవి కూడా చదవండి..

రాముడు మావాడే.. శివుడూ మావాడే

పాక్‌కు చైనా సాయం.. కథ మొత్తం బయటపెట్టిన భారత్!

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 08 , 2025 | 03:30 PM