Share News

Nehal Deepak Modi: నీరవ్ మోదీ సోదరుడు అమెరికాలో అరెస్టు

ABN , Publish Date - Jul 05 , 2025 | 04:05 PM

సీబీఐ, ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీ అరెస్ట్ అయ్యాడు. స్థానిక అధికారులు బెల్జియం జాతీయుడైన నేహాల్ మోదీని అమెరికాలో అరెస్టు చేశారు.

Nehal Deepak Modi: నీరవ్ మోదీ సోదరుడు అమెరికాలో అరెస్టు
Nehal Deepak Modi:

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13,500 కోట్లకు పైగా పంగనామాలు పెట్టి విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీ ఫ్యామిలీ ఆయా దేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. పీఎన్బీ ఖాతాదారుల కష్టార్జితాన్ని కొల్లగొట్టిన ఈ కుటుంబం వేర్వేరు దేశాలు పారిపోయి, అక్కడ ఏళ్లకేళ్లుగా పబ్బం గుడుపుకుంటోంది. అయితే, వీరందర్నీ ఎలాగైనా భారత్‌కు రప్పించాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో దౌత్యయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో తాజాగా నీరవ్ మోదీ తమ్ముడు నేహాల్ దీపక్ మోదీ అరెస్ట్ అయ్యాడు.

Nirav-Modi-3.jpgసెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా స్థానిక అధికారులు బెల్జియం జాతీయుడైన నేహాల్ మోదీని జులై 4న అమెరికాలో అరెస్టు చేశారు. సుదీర్ఘమైన.. చట్టపరమైన, ఇంకా దౌత్య ప్రక్రియ తర్వాత ఎట్టకేలకు నేహాల్ మోదీ అరెస్టు జరిగింది. ఇదే సమయంలో నేహాల్ మోదీ రెడ్ కార్నర్ నోటీసును సవాలు చేశాడు. కానీ, సఫలం కాలేకపోయాడు. దీంతో అరెస్ట్ అనివార్యమైంది.

Nirav-Modi-Brother.jpg


ఇలా ఉండగా, 2018 ప్రారంభంలో వెలుగుచూసిన బ్యాంకింగ్ మోసం స్కాంలో నేహాల్ మోదీ అన్నయ్య నీరవ్ మోదీ ప్రధాన నిందితుడు. ఈ భారీ బ్యాంకింగ్ కుంభకోణంలో ప్రమేయం ఉందని నేహాల్ మోదీపై అభియోగాలు మోపారు. ఈ కుంభకోణం తర్వాత కీలక సాక్ష్యాలను నాశనం చేయడం, సాక్షులను బెదిరించడం, దర్యాప్తును అడ్డుకోవడంలో నేహాల్ మోదీ పాత్ర ఉందని భారత అధికారులు ఆరోపిస్తున్నారు.

Nehal-Deepak-Modi.jpgనేహాల్ మోదీ తన సోదరుడి సహాయంతో ఈ కుంభకోణం నుంచి సంపాదించిన వేల కోట్ల విలువైన నల్లధనాన్ని వైట్ మనీగా మార్చాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. నేహాల్ ఈ డబ్బును షెల్ కంపెనీలు, విదేశాలలో జరిగిన లావాదేవీల ద్వారా పంపిణీ చేసినట్లు దర్యాప్తులో తేలింది.

Nirav-Modi.jpgఅయితే, నేహాల్ మోదీని భారత్ కు అప్పగించే కేసుకు సంబంధించి తదుపరి విచారణ జులై 17న ఉంటుంది. ఈ సమయంలో, నేహాల్ మోదీ తరఫున బెయిల్ దరఖాస్తు దాఖలు చేయవచ్చు. కానీ, అమెరికా ప్రాసిక్యూషన్ ఇప్పటికే బెయిల్‌ను వ్యతిరేకిస్తోందని స్పష్టం చేసింది.

Nehal-Modi-and-Nirav-Modi.jpg


ఇవి కూడా చదవండి..

వీడు నావాడు.. పెళ్లి వేదికపై వరుడిని కౌగిలించుకున్న బుర్కా మహిళ.. వధువు రియాక్షన్ చూస్తే..


మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోలో గుర్రం ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 05 , 2025 | 04:41 PM