Air India: ఎయిరిండియాకు 6 నెలల్లో 9 నోటీసులు.. కేంద్రం వెల్లడి
ABN , Publish Date - Jul 21 , 2025 | 08:27 PM
అహ్మదాబాద్‌లో గత నెలలో బోయింగ్ డ్రీమ్‌లైనర్ కుప్పకూలిన దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని బోయింగ్ 787-8/9 డ్రీమ్‌లైనర్ల తనిఖీలకు డీజీసీఏ ఆదేశించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు.

న్యూఢిల్లీ: ఐదు భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి ఎయిరిండియా (Air India)కు గత 6 నెలల్లో 9 షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. ఒక ఉల్లంఘనకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్య కూడా పూర్తయిందని వివరించింది. ఈ మేరకు రాజ్యసభ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు (K Rammohan Naidu) సోమవారం సమాధానం ఇచ్చారు.
అహ్మదాబాద్‌లో గత నెలలో బోయింగ్ డ్రీమ్‌లైనర్ కుప్పకూలిన దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని బోయింగ్ 787-8/9 డ్రీమ్‌లైనర్ల తనిఖీలకు డీజీసీఏ ఆదేశించిందని కేంద్ర మంత్రి వివరించారు.
మొత్తం 33 విమానాల్లో 31 ఆపరేషనల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో తనిఖీలు నిర్వహించగా 8 విమానాల్లో చిన్నచిన్న లోపాలు గుర్తించినట్టు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. లోపాలు సవరించిన అనంతరం తిరిగి విమాన సర్వీసులు కొనసాగుతున్నాయని తెలిపారు. మిగతా 2 విమానాలు షెడ్యూల్ట్ మెయింటెనెన్స్‌లో ఉన్నట్టు బీజేపీ సభ్యుడు అశోక్‌రావు శంకర్‌రావు చవాన్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి