PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ
ABN , Publish Date - Apr 29 , 2025 | 03:11 PM
PM Modi: 21వ శతాబ్దపు డిమాండ్లను తీర్చడానికి దేశ విద్య వ్యవస్థను ఆధునికరించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ క్రమంలో భవిష్యత్తులో ప్రతి సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమంగా మార్చడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా యువతకు ఆయన పిలుపు నిచ్చారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: దేశ భవిష్యత్తు కోసం యువతను సిద్ధం చేయడంలో విద్యా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ విద్యా వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ శతాబ్దానికి అనుగుణంగా విద్య వ్యవస్థను అధునీకరించే దిశగా తమ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకొంటుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో వైయూజీఎం సదస్సులో ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. ప్రపంచ విద్యా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని దీనిని రూపొందించామన్నారు. ఈ విద్య విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత.. జాతీయ పాఠ్యాంశాల్లోనే కాకుండా.. అభ్యస, బోధనా విధానంలో పలు మార్పులు చూస్తున్నామని పేర్కొన్నారు. వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ కింద ఏఐ (కృతిమ మేథ) అధారిత మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. దీనిని సైతం విస్తరించేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్పారు.
21వ శతాబ్దపు డిమాండ్లను తీర్చడానికి దేశ విద్య వ్యవస్థను ఆధునికరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ క్రమంలో భవిష్యత్తులో ప్రతి సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమంగా మార్చడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా యువతకు ఆయన పిలుపు నిచ్చారు. 2013-14లో పరిశోధనాభివృద్ధికి స్థూల వ్యయంలో కేవలం రూ. 60 వేల కోట్లు మాత్రమే కేటాయించారని.. కానీ నేడు అది 1.25 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. టాలెంట్, టెంపర్‌మెంట్, టెక్నాలజీ అనే మూడు అంశాలు భారత్ భవిష్యత్తును మారుస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. యువశక్తి ఆవిష్కరణలకు భారతీయ విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు (క్యాంపస్) డైనమిక్ (గతి శీలక)కేంద్రాలుగా రూపొందుతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..
Viral News: పాకిస్తాన్ను 4 ముక్కలు చేయాలి..ఇలా చేస్తేనే వారికి మేలు..
For National News And Telugu News..