Chennai: నిండు అసెంబ్లీలో.. సీఎం, మాజీసీఎంల మధ్య వాగ్వాదం
ABN , Publish Date - Apr 22 , 2025 | 11:44 AM
నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘నీట్’పై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.

- ‘నీట్’పై సీఎం, మాజీసీఎంల వాగ్వాదం
- పరస్పర ఆరోపణలతో వేడెక్కిన అసెంబ్లీ
చెన్నై: శాసనసభ ఎన్నికల సందర్భంగా నీట్ రద్దు చేస్తామంటూ బూటకపు వాగ్దానం చేసి ప్రజలను మోసగించిన డీఎంకే అధికారంలోకి వచ్చిందని ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే సభాపక్షనాయకుడు ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) అసెంబ్లీలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు నీట్ రద్దుపై ఈపీఎస్ ఎందుకు మాట్లాడలేదో సభకు తెలపాలని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) నిలదీశారు.
ఈ వార్తను కూడా చదవండి: JD Vance Jaipur Tour: అంబర్ కోటను సందర్శించిన జేడీ వాన్స్ కుటుంబం
నీట్‌ను రద్దు చేస్తామని హామీ ఇస్తేనే బీజేపీతో పొత్తుపెట్టుకుంటామని అమిత్‌షా(Amith Sha) దగ్గర ఎందుకు చెప్పలేకపోయారంటూ ప్రశ్నించారు. శాసనసభలో సోమవారం ఉదయం ప్రజారోగ్యశాఖకు సంబంధించిన ఆర్థిక అనుబంధ పద్దులపై చర్చ జరిగింది. ఆ సందర్భంగా ఎవరి పాలనలో రాష్ట్రంలో ఎక్కువగా వైద్యకళాశాలలు వచ్చాయనే విషయం చర్చకు వచ్చింది. రవాణాశాఖ మంత్రి శివశంకర్ మాట్లాడుతూ..గత పదేళ్ల అన్నాడీఎంకే ప్రభత్వ హయాంలోనే నీట్ పై మినహాయింపు కోరలేదని, ఆ సమయంలో కేంద్రంలోని బీజేపీ పాలకులు, అన్నాడీఎంకే నేతల మధ్య ఓ తమిళ సినిమాలో కామెడీ దృశ్యంలో పేర్కొన్నట్లు ‘నీట్‌ను మీరే ఉంచుకోండి, అందుకు ప్రతిఫలంగా 11 వైద్యకళాశాలు ఇవ్వండి’ అంటూ ‘బేకరీ డీలింగ్’ కుదుర్చుకున్నారని యెద్దేవాచేశారు.
ఈ సమయంలో ఈపీఎస్ జోక్యం చేసుకుంటూ నీట్ రావటానికి కాంగ్రెస్- డీఎంకే సంకీర్ణ ప్రభుత్వమే కారణమని, ఆ సమయంలో నీట్‌ను తీవ్రంగా వ్యతిరేకించింది అన్నాడీఎంకే మాత్రమేనని చెప్పారు. మంత్రి శివశంకర్ మాట్లాడుతూ కరుణానిధి, జయలలిత అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోకి నీట్ రాకుండా సమర్థవంతంగా అడ్డుకున్నారని, ఈపీఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నీట్ పరీక్షలు వచ్చాయని ఆరోపించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం జోక్యం చేసుకుని అన్నాడీఎంకే పాలనలో 11 వైద్యకళాశాలలకు అనుమతి లభించినా ఆ వైద్యకళాశాలల నిర్మాణపనులు నత్తనడకన నడిచి 20 శాతం పనులు మాత్రమే జరిగాయని, డీఎంకే అధికారంలోకి రాగానే నిర్మాణ పనులు ఊపందుకున్నాయని చెప్పారు.
ముఖ్యమంత్రి స్టాలిన్ జోక్యం చేసుకుని మాట్లాడుతూ... నీట్ రద్దు చేయించడానికి అన్నాడీఎంకేకు ఇటీవల మంచి అవకాశం వచ్చిందని, అమిత్‌షాతో పొత్తుపై చర్చలు జరిపినప్పుడు నీట్‌ను మినహాయిస్తామని ప్రకటిస్తేనే పొత్తుపెట్టుకుంటామని నిబంధన పెట్టి ఉంటే బాగుండేదని చెప్పారు. నీట్‌కు శ్రీకారం చుట్టింది డీఎంకే నేతలేనని, శాసనసభ ఎన్నికల సమయంలో నీట్ రద్దు చేయడం తమకే సాధ్యమవుతుందని హామీలతో ఓటర్లను మోసగించి అధికారంలోకి వచ్చారని ఈపీఎస్ ఆరోపించారు.
నీట్‌ను రద్దు చేస్తామని తాము ఎవరినీ మోసగించలేదని, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి ఉంటే నీట్ నుంచి మినహాయింపును సులువుగా పొంది వుం డేవాళ్లమని స్టాలిన్ చెప్పారు. ఇంతే కాకుండా బీజేపీతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనే కాకుండా 2031లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీతో సహవాసం పెట్టుకోమని ప్రతిపక్షనేత ఈపీఎస్ ప్రగల్భాలు పలికి, ప్రస్తుతం ఆ పార్టీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగటం భావ్యమేనా? అని ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Price Record: బంగారం లకారం
గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు
కేటీఆర్‌పై కేసులు కొట్టివేసిన హైకోర్టు
ACB: ఏసీబీ వలలో ఐదుగురు అధికారులు
Read Latest Telangana News and National News